News
News
X

Zodiac signs: ఈ రాశులవారు సంయమనంతో ఉంటారు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనం కోల్పోరు

Zodiac signs: కొంతమంది కోపంగా ఉంటారు..ఇంకొందరు ఆవేశపడిపోతుంటారు..మరికొందరు మాత్రం సహనంగా సంయమనంతో వ్యవహరిస్తారు..ఇది కూడా మీ రాశిని బట్టే ఉంటుందట..మరి సంయమనంతో వ్యవహరించే రాశులేంటో చూద్దాం...

FOLLOW US: 
 
Zodiac signs: ఎవ్వరికైనా జీవితంలో ఓపిక, సహనం చాలా అవసరం. సహనం ఓ సద్గుణం.  కానీ ఇది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది.ఎందుకంటే ఉరకల పరుగుల జీవితంలో ఒత్తిడి గురై సహనం అనే మాటే దూరమైపోతోంది. ఈ ఒత్తిడిని జయించడానికే యోగా, ధ్యానం చేయాలంటారు నిపుణులు. అయితే కొందరికి మాత్రం సహనం, సంయమనం పుట్టుకతోనే వచ్చే లక్షణం అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.  ఎందుకంటే కొంతమందిని చూస్తే అనిపిస్తుంటుంది...వీళ్లకు సహనం,ఓపిక చాలా ఎక్కువ అని. ఎంత పెద్ద సంఘటన జరిగినా సరే చూసుకుందాంలే అంటారు కానీ ఆవేశపడిపోరు..షార్ట్ టెంపర్ ప్రదర్శించరు. అందుకే కాస్త టైమ్ పట్టినా కానీ సమస్యను కూల్ గా సాల్వ్ చేసుకుంటారు. ఈ ప్రవర్తనకు కూడా కారణం మీ రాశి అంటారు జ్యోతిష్యులు. మరి సహనం, సంయమనానికి కేరాఫ్ అని చెప్పుకునే రాశులేంటో చూద్దాం....

వృషభ రాశి
ఈ రాశివారు ఓపికకు చిరునామాగా వ్యవహరిస్తారు. ఏదైనా ఆకస్మిక సంఘటన జరిగినా వెంటనే ఏదో ఆలోచనలో పడి ఉండిపోయినా కష్టానికి తగిన ఫలితం వస్తుందని నమ్ముతారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోరు. ఈ రాశివారు అసహనానికి గురికాకుండా ప్రశాంతంగా తమపని తాము  చేయడం తెలివైన పనిగా భావిస్తారు. 

Also Read: కార్తీకమాసం నెలరోజులూ తలకు స్నానం చేయకపోతే ఏమవుతుంది!

కర్కాటక రాశి
చంద్రునికి చెందిన కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన భావోద్వేగాలు కలిగిఉంటారు. వీరు ఎదుటివారి భావాలను అర్థం చేసుకుంటారు, వారి భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుంటారు...అందుకే ఏదైనా జరిగిన వెంటనే ఆవేశం ప్రదర్శించకుండా సంయమనంతో వ్యవహరిస్తారు. కర్కాటక రాశివారు తాము ఇష్టపడే వ్యక్తులకోసం ప్రతి పనీ చేయగలరు...అందుకే ఈ రాశివారితో జీవితం ప్రశాంతం...

News Reels

కన్యా రాశి
ఈ రాశివారికి యాజమాన్య లక్షణాలుంటాయి. ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు ఈ రాశివారు సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్న వనరులను ఉపయోగించుకోవడంతో పాటూ పదిమందికి ఉపయోగపడేలా వ్యవహరిస్తారు. ఏం జరిగినా కారణాలు అన్వేషించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోరు. సహనానికి మారుపేరుగా అనిపించే కన్యారాశివారు పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు మరెవ్వరికీ సాధ్యం కాదు. 

Also Read: నాగుల చవితి పుట్టలో పాలుపోసే ముహూర్తం వివరాలు, పుట్ట దగ్గర చేయాల్సిన ప్రార్థన!

వృశ్చిక రాశి
అంగారక గ్రహానికి చెందిన వృశ్చిక  రాశివారికి కూడా సహనం ఉండడం ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఎందుకంటే ప్రతీకార జాబితాలో ఈ రాశిదే అగ్రస్థానం. ఎవ్వరినైనా టార్గెట్ చేస్తే ఎదుటివారు తప్పించుకోలేనంత ఊబిలోకి నెట్టేయగలరు. అయినప్పటికీ వీరు చాలా ఓపికతో ఉంటారు..కొన్ని సందర్భాల్లో సంయమనం అస్సలు కోల్పోరు. అంటే సంఘటన జరిగిన వెంటనే రియాక్టవకుండా...సమయం కోసం పొంచి ఉంటారు...

కుంభ రాశి
శని ఆధీనంలో ఉన్న కుంభరాశి వారికి స్వతంత్ర్య భావాలెక్కువ. అందుకే ఎంత నచ్చని సంఘటన జరిగినా మళ్లీ తమ మనసుకి నచ్చినట్టు జరిగేవరకూ సహనంగా వేచి చూస్తారు.  ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవడం వీరికి ఇష్టం ఉండదు. అనవసర కోపం ప్రదర్శించకుండా పరిస్థితిని ఓపికగా వ్యవహరిస్తారు. 

నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Published at : 28 Oct 2022 07:08 PM (IST) Tags: zodiac signs Astrology astrology in telugu These Zodiac signs are calm zodiac astrology article

సంబంధిత కథనాలు

Horoscope Today 3rd  December 2022:  ఈ రాశివారు ధీమా వీడకపోతే  వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd December 2022: ఈ రాశివారు ధీమా వీడకపోతే వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు