Nagula Chavithi 2022 Puja Muhurat: నాగుల చవితి పుట్టలో పాలుపోసే ముహూర్తం వివరాలు, పుట్ట దగ్గర చేయాల్సిన ప్రార్థన!
Nagula Chavithi 2022 : చవితి తిథి శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమై శనివారం ఉదయం వరకూ ఉంది. మరి నాగులచవితి ఎప్పుడు జరుపుకోవాలి.. పుట్టలో పాలుపోసే ముహూర్తం ఎప్పుడో చూద్దాం...
Nagula Chavithi 2022 Puja Muhurat: తిథులు తగులు, మిగులు ( ముందురోజు మర్నాడు) రావడంతో నాగుల చవితి విషయంలోనూ కొంత కన్ఫ్యూజన్ ఉంది. శుక్రవారం జరుపుకోవాలని కొందరంటే..శనివారం సూర్యోదయానికి చవితి తిథి ఉంది కాబట్టి శనివారమే పుట్టలో పాలు పోయాలంటున్నారు మరికొందరు. మరి చవితి తిథి ఎప్పటి నంచి ఎప్పటి వరకూ ఉందో పరిశీలిస్తే..
- అక్టోబరు 28 శుక్రవారం తదియ మధ్యాహ్నం 12.24 వరకూ ఉంది..తదుపరి చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి
- అక్టోబరు 29 శనివారం ఉదయం 10.23 వరకూ చవితి ఘడియలు ఉన్నాయి
వాస్తవానికి రాత్రివేళ చేసే పండుగలు ( దీపావళి, అట్ల తదియ,కార్తీక పౌర్ణమి) అయితే రాత్రికి తిథి ఉండడం ప్రధానం. మిగిలిన అన్ని పండుగలకు సూర్యోదయానికి తిథి ఉండడమే లెక్కలోకి వస్తుంది. అంతెందుకు ఈ మధ్య జరుపుకున్న దీపావళి అలాగే చేసుకున్నాం...సూర్యోదయానికి చతుర్థశి తిథి,సూర్యాస్తమయానికి అమావాస్య తిథి ఉండడంతో నరకచతుర్థశి, దీపావళి అమావాస్య ఒకేరోజు చేసుకున్నాం. ఇక నాగుల చవితికి సూర్యోదయానికి తిథి ప్రధానం కాబట్టి శనివారమే నాగుల చవితి జరుపుకోవడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పండితులు...
సాధారణంగా ఉదయం సమయంలో వర్జ్యం,దుర్ముహూర్తాలు ఉన్నా ఆ టైమ్ లో పుట్టలో పాలుపోయరు...
శనివారం పరిశీలిస్తే... ఉదయం 5.58 నుంచి 7.34 వరకూ వర్జ్యం ఉంది
దుర్ముహూర్తం రాత్రి 7.31 నుంచి 9.10 వరకు ఉంది...
అంటే వర్జ్యం పోయిన తర్వాత అంటే ఏడున్నర తర్వాత....చవితి ఘడియలు దాటిపోకుండా అంటే దాదాపు పదిన్నర లోపు నాగేంద్రుడి పూజ చేయాలి...
Also Read: కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే జ్వాలా తోరణం కిందనుంచి ఎందుకు దాటితే ఏమవుతుంది!
పుట్ట దగ్గర ఇలా చదువుకుంటారు
నన్నేలు నాగన్న , నాకులమునేలు
నాకన్నవారల నాఇంటివారనేలు
ఆప్తమిత్రులనందరిని ఏలు
పడగ తొక్కిన పగవాడనుకోకు
నడుము తొక్కిన నావాడనుకో
తోక తొక్కితే తొలిగిపో వెళ్లిపో
ఇదిగో ! నూకల్ని పుచ్చుకో మూకల్ని ( పిల్లల్ని) ఇవ్వు
అని పుట్టలో పాలు పోస్తూ నూక వేసి వేడుకుంటారు
మరో ప్రార్థన
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!
మనిషిలో విషసర్పం శేతత్వం పొందేందుకే
మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలా ఉంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కతూ మనిషిలో సత్వగుణాన్ని హరించివేస్తుంది. అందుకోసమే నాగుల చవితిరోజు ప్రత్యక్షంగా విషసర్పాలున్న పుట్టలను ఆరాధించి పాలుపోస్తే మనిషిలో ఉన్న విషసర్పం శ్వేతత్వం పొందుతుందని పండితులు చెబుతారు.
నోట్: ఇవి పండితులు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..