అన్వేషించండి

Zodiac Signs who Gives Best Hugs : ప్రేమతో కూడిన హగ్ ఇవ్వడం ఓ ఆర్ట్ - ఇందులో ఈ రాశులవారు స్పెషలిస్టులు

Zodiac Signs: హగ్ ఇవ్వడం ఓ ఆర్ట్. ఇందులో ఆర్టేముంది అనుకోవద్దు.. ఆనందం, బాధ, ఆవేశం, ఆగ్రహం ఎలాంటి సందర్భాల్లోనైనా ఊహించనంత ఉపశమనం కలిగిస్తుంది ఓ హగ్. ఈ విషయంలో ఈ రాశులవారు స్పెషలిస్టులంట....

Zodiac Signs who Gives Best Hugs :  సందర్భం ఏదైనా మంచి ఉపశమనం హగ్. ప్రేమతో కూడిన కౌగిలింత సంతోషంలో ఉన్నవారి సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.. బాధలో ఉండేవారికి స్వాంతన చేకూర్చుతుంది. అందుకే సందర్భం ఏదైనా ఓ హగ్ ఇచ్చే రిలీఫ్ వేరు. అంటే ఏదో మొక్కుబడిగా కాదు మీ స్పర్శలో ఆప్యాయతను ఎదుటివారు ఫీలవ్వాలి. అందుకే అంటారు హగ్ ఇవ్వడం కూడా ఓ కళ అని. ఈ విషయంలో ఈ 6 రాశులవారు స్పెషలిస్టులు అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..

మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆప్యాయత నిండిన హగ్ ఇవ్వడంలో మిథున రాశివారు స్పెషలిస్టులట. భావోద్వేగాలతో నిండిన కౌగిలింత ఇచ్చి ప్రియమైన వారికి వీడ్కోలు చెప్పాలి అనుకుంటారు. ఈ రాశివారు చూపించే ప్రేమముందు ఎవ్వరైనా దాసోహం కావాల్సిందే. 

Also Read: ఈ 5 రాశులవారికి ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఒకే ఒక్క హగ్ తో ఎదుటివారు తమకు ఎంత ప్రత్యేకమో చెప్పేస్తారట కర్కాటక రాశివారు.  ఒక్కసారి కమిటైతే నేనున్నా అనే భరోసా ఇవ్వడంలో వీళ్లకు వీళ్లే సాటి. అదే నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడంలో తగ్గేదేలే అన్నట్టుంటారు. వీరు కౌగిలింతని చాలా సున్నితమైన అంశంగా, ప్రత్యేకమైనదిగా భావిస్తారు. 

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

అడవికి రాజు సింహం కదా..ఈ రాశివారు హగ్స్ కి రాజు లాంటివారని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ రాశివారు  స్నేహం, శృంగారాన్ని కలగలపిన వెచ్చని కౌగిలింత అందించడంలో స్పెషల్. తమ ప్రియమైన వారి భావోద్వేగాలను బట్టి వీరి హగ్స్ స్టైల్ మారుతుందట.

Also Read: ఈ 5 రాశులవారికి పెళ్లి కన్నా డేటింగే ఇష్టం!

కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

కన్యా రాశివారు మనసులో భావాలను పెద్దగా ప్రదర్శించరు కానీ..కౌగిలింతతో వ్యక్తం చేసేందుకు ఇష్టపడతారట. వీరి హగ్ సున్నితంగా, ఆప్యాయంగా అనిపిస్తుందట. 

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం,అనూరాధ, జ్యేష్ఠ)

ఎవరి భావాలను అయినా హగ్ ని అయినా స్వీకరించేందుకు వృశ్చికరాశివారు సిద్ధంగా ఉంటారు కానీ వీరు మాత్రం తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఇష్టపడరట. వీరి ఆలోచనలు, హగ్స్ స్నేహపూర్వకంగా కాకుండా వ్యక్తిగతంగా ఉంటాయట. 

Also Read: ప్రేమను వ్యక్తం చేయడంలో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

అన్ని రాశులవారి కన్నా మీనరాశి వారు జాలీగా ఉండటాన్ని ఇష్టపడతారు. హగ్స్ విషయంలో నీకన్నా ఎవ్వరూ ఎక్కువ లేరన్నట్టు ఉంటారట. నిస్వార్థమైన ప్రేమను అందిస్తున్నా అనే అభిప్రాయాన్ని మాటల ద్వారా కాకుండా మంచి హగ్ ద్వారా తెలియజేయాలి అనుకుంటారట.

గమనిక: కొన్ని పుస్తకాలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ జన్మ నక్షత్రంలో గ్రహస్థితి ఆధారంగా కూడా మీ వ్యక్తిత్వంలో చాలా మార్పులుంటాయి.ఇవన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget