Weekly Horoscope in Telugu : డిసెంబరు ఆఖరి వారం ఈ 7 రాశులవారికి అద్భుతంగా ఉంది
Horoscope Weekly: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Weekly Horoscope in Telugu ( December 26, 2022 to January 1st, 2023)
మేష రాశి
ఈ వారం ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులను కలుస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలవారికి అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన విషయాల్లో క్లారిటీ మెంటైన్ చేయండి. ఒత్తిడితో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
వృషభ రాశి
మీ మనోబలం పెరుగుతుంది. అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు గతవారంతో పోలిస్తే ఈ వారం కొంత ఉపశమనం ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
మిథున రాశి
ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. తలపెట్టిన పనులు కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ పూర్తిచేయగలుగుతారు. సన్నిహితుల సలహాతో అతిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అనుకున్న విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారులు లాభాలు సాధిస్తారు. కళారంగం వారికి అనుకూలమైన సమయం
Also Read: 2023లో ఈ 5 రాశులవారిపై శుక్రుడి అనుగ్రహం - ఏడాదంతా ఆర్థికంగా తిరుగుండదు!
కర్కాటక రాశి
ఈ వారం ఆర్థిక లావాదేవీలు బాగా సాగుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలపై చర్చిస్తారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలుకి సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటారు. మీ ఆలోచనా విధానానికి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారం విస్తరించాలన్న ఆశ ఫలిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది.
సింహ రాశి
ఈ వారం ఈ రాశివారి చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నిరుద్యోగులు ఆశ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరిపోతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని సంఘటనలు జ్ఞానోదయం కలిగిస్తాయి.
కన్యా రాశి
దైవబలం మీకు తోడుంటుంది. ఈ వారం ప్రారంభించిన పనులు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులు మంచిఉద్యోగంలో స్థిరపడతారు. వాహనం కొనుగోలు చేయాలన్న మీకల నెరవేరుతుంది. వ్యాపారాలు లాభాలు పొందుతారు. ఉద్యోగులు సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. విరోధులకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
తులా రాశి
గతవారం కన్నా ఈ వారం తులారాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనుకున్న పనులుపూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తేనే పనులు పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండాలి
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు కష్టపడితేనే ఫలితాలు అందుకుంటారు. వ్యాపారాలు అంతబాగా సాగవు. ఉద్యోగులకు పనిఒత్తిడి ఉంటుంది. కళారంగం వారికి మంచి సమయం. ఈ వారం ఓ శుభవార్త వింటారు
ధనుస్సు రాశి
ఈ వారం ధనస్సు రాశివారికి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోండి. సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. ఖర్చులు తగ్గించాలి. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.
Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు
మకర రాశి
ఈ రాశివారు ఈ వారం కొత్త ప్రణాళికలు అమలుచేస్తే సక్సెస్ అవుతారు. మీ రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగులు సమస్యలు తీరుతాయి. వ్యాపారం బావుంటుంది. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తపడడండి.
కుంభ రాశి
ఈ వారం ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం ఉంది. నిరుద్యోగులు స్థిరపడతారు. కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కివస్తాయి. వ్యాపారాల్లో నెలకొన్న సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగులు పని ఒత్తిడి నుంచి బయటపడతారు. కళారంగం వారికి అనుకూల సమయం. అనవసర ఖర్చులు తగ్గించాలి.
మీన రాశి
ఈ వారం మీకు అనుకూల సమయం. ఉద్యోగులు, వ్యాపారులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కళారంగం వారికి గతవారం కన్నా ఈ వారం బావుంటుంది. వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని సమస్యలు తీరడంతో ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు పడతారు.