Weekly Horoscope 21-27 August: ఈ వారం ఈ రాశులవారికి ఆనందం, వారికి ఆదాయం - ఆగష్టు 21 to 27 వారఫలాలు
ఆగష్టు 21 నుంచి 27 వరకూ ఈ వారం మీ రాశిఫలం ఇక్కడ తెలుసుకోండి...
Weekly Horoscope 21-27 August
మేష రాశి
ఈ రాశివారికి ఈవారం చాలా మంచిది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు పొందుతారు. మీ ప్రణాళికలన్నీ కూడా విజయవంతమవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రత్యేగ గౌరవం ఉంటుంది, మీ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఏవైనా విభేదాలు ఉంటే సమసిపోతాయి. విద్యార్థులకు శుభసమయం. ఆరోగ్యం బావుంటుంది. చేపలకు ఆహారం వేయండి.
వృషభ రాశి
ఈ రాశివార ఈ వారం అతికష్టం మీద పనులు పూర్తిచేస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఇంకొంతకాలం నిరాశ తప్పదు. కొన్ని ప్రతికూల వార్తలు వినాల్సి రావొచ్చు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ తగ్గుతుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. వైవాహిక జీవితం బావుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. మీరు ప్రారంభించే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వినాయకుడికి మోదకం సమర్పించండి.
మిథున రాశి
ఈ రాశివారికి ఈ వారం చాలా బావుంటుంది. ఆర్థికంగా ముందడుగు వేసేందుకు చాలా అవకాశాలు పొందుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రత్యర్థులు మీకు హాని చేయడానికి ప్రయత్నించి విఫలమవుతారు. ఉద్యోగులు పురోగతి పొందుతారు. విద్యార్థులు కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం ఆరోగ్యం కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠించండి.
కర్కాటక రాశి
ఈ వారం కర్కాటక రాశివారు కష్టపడితేనే ఫలితం పొందుతారు. ఎవ్వరికీ హాని తలపెట్టవద్దు. మీరు ప్రతి పనిలో చాలా కృషి చేసిన తర్వాత మాత్రమే విజయాన్ని పొందుతారు. ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కానీ ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్త అవసరం. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకొవద్దు. విద్యార్థులకు చదువుపై కాకుండా ఇతర విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులుంంటాయి. జీవనోపాధికి సంబంధించిన పనులు పూర్తిచేయండి.
సింహ రాశి
ఈ వారం మీరు అధిక ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో పనిపై శ్రద్ధ పెరుగుతుంది. గడిచినవారం కన్నా వ్యాపారం జోరందుకుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి..గాయపడే ప్రమాదం ఉంది. విద్యార్థులు చాలా సమయం వృధాగా గడిపేస్తారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. బయటి పనుల వల్ల నిరంతరం మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో ఆకస్మిక టెన్షన్ పెరగుతుంది. శివుడిని దర్శించుకోండి.
Also Read: అష్టకష్టాలు తొలగించి ఐశ్వర్యాన్నిచ్చే స్తోత్రం - శ్రావణ శుక్రవారం పఠించండి!
కన్యా రాశి
ఈ వారం ఉపాధి కోసం చూస్తున్న ఈ రాశివారు గుడ్ న్యూస్ వింటారు. మంచి ఉద్యోగంలో కుదురుకుంటారు. వ్యాపారులు బిజీ బిజీగా ఉంటారు. ఈ వారం ఏ ప్రణాళికలు వేసుకున్నా అవి విజయవంతం అవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. పక్షులకు ఆహారం వేయండి.
తులా రాశి
ఈ రాశివారికి ఈ వారం కలిసొచ్చే సమయం. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. అదృష్టం కలిసొస్తుంది. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. వ్యాపారం పరిధి పెరుగుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పెద్దల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. హనుమంతుడిని దర్శించుకోండి.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది కానీ చిన్న చిన్న సమస్యలు తెృలెత్తుతాయి. ప్రయాణం చేసేటప్పుడు వాహనం జాగ్రత్తగా నడపండి ప్రమాద సూచనలున్నాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. సోదరుల కారణంగా ఆనందంగా ఉంటారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. అవకాశాలు వినియోగించుకోవడంపై శ్రద్ధ చూపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి
ధనుస్సు రాశి
ఈ రాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. అనవసర పరుగులు తీయొద్దు. వ్యాపారంలో సమస్యలు మానసికంగా కృంగిపోయేలా చేస్తాయి. ఎవ్వరితోనూ వాగ్వాదానికి దిగొద్దు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. ఈవారం ఆరంభంలో కన్నా చివర్లో బాగానే ఉంటుంది. విజ్ఞాన, శాస్త్ర రంగాలలో ఉండేవారు మంచి పురోగతిని సాధిస్తారు. భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. గణేశుడికి గరిక సమర్పించండి.
Also Read: దైవారాధన నుంచి ఖగోళంలో జరిగే అద్భుతాల వరకూ అన్నిటికీ ఈ పురాణాలే ఆధారం!
మకర రాశి
ఈ రాశివారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. కోపం తగ్గించుకోవాలి. నూతన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. వ్యాపారం బాగానే సాగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం ఉత్తమం. వైవాహిక జీవితం బావుంటుంది. పనితో పాటూ తేలికపాటి వ్యాయామంపైన శ్రద్ధ వహించాలి. పేదలకు ఆహారం అందించండి
కుంభ రాశి
ఈ రాశివారు ఈ వారం ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు శుభసమయం...పనిపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణం మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం బావుంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. వారాంతంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి కానీ వాటిని తేలికగానే అధిగమిస్తారు. శివుడిని దర్శించుకోండి.
మీన రాశి
ఈ రాశివారికి ఈ వారం మంచి ఫలితాలున్నాయి. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తెలియని వ్యక్తులను నమ్మవద్దు. ఉద్యోగులు పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం బావుంటుంది కానీ మీలో ఏదో ఆందోళన ఉంటుంది. ప్రేమసంబంధాలతో సమస్యలేమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారులు నూతన పెట్టబడులు పెట్టేందుకు ఇంకొంత కాలం ఆగితే మంచిది. హనుమాన్ స్తోత్రం పఠించండి.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.