News
News
X

Weekly Horoscope: ఈ రాశుల వారు ఈ వారం అపరిచితులతో చర్చలు పెట్టొద్దు. ఈ ఆరు రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 4 వరకూ ఈ వారం రాశిఫలాలు

మేషరాశి

మేషరాశి వారికి ఈ వారం ఫలితాలు అంత అనకూలంగా లేవు. ఈ వారం ఎంత కష్టపడి పనిచేసినా పూర్తిస్థాయిలో ఫలితం దక్కదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితులను కలుస్తారు..కొత్త సమాచారాలు అందుకుంటారు. ఇంట్లో వివాదాలు సమసిపోతాయి. మానసకి ఒత్తిడి ఉంటుంది. పని ఒత్తిడి పెరగడం వల్ల బాగా అలసటగా అనిపిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్థ తీసుకోండి .

వృషభం

వృషభ రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. చేపట్టిన బాధ్యతలు పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉండొచ్చు. అప్పుల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అపరిచితులతో అనవసర చర్చలు వద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

మిధునం

ఈ రాశి వ్యక్తులు గందరగోళంగా ఉంటారు. ఈ వారం వ్యాపారంలో లాభనష్టాలు రెండూ ఎదురవుతాయి. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం తగ్గించాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది.

Also Read: శిల్ప తెలిసే తప్పులు చేయబోతుందా? ఎలాంటి తప్పు చేయబోతుందామె? నేర్చుకునే పాఠాలేంటి?

కర్కాటక రాశి

వ్యాపారులకు ఈ వారం కలిసొస్తుంది. అనుకున్న పనుల్లో కొన్ని ఆటంకాల వల్ల టెన్షన్ పడతారు. శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండండి. సహోద్యోగులతో వివాదాలు ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. పని ప్రదేశంలో శుభవార్తలు వింటారు.

సింహరాశి

వైవాహిక జీవితంలో టెన్షన్ ఉండొచ్చు.ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. చిరాకుగా వ్యవహరిస్తారు. వ్యాపారులకు బావుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చొద్దు. భాగస్వాములు జాగ్రత్తగా ఉండాలి.

కన్య జాతకం

ఈ రాశి వారికి ఈ వారం కలిసొస్తుంది. పెట్టిన పెట్టుబడి లాభసాటిగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలున్నాయి. మాట్లాడేటప్పుడు ఆలోచించండి. కుటుంబ కార్యక్రమాలు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. టెన్షన్ పోతుంది. బంధువుతో పాత విభేదాలు పరిష్కారమవుతాయి.

Also Read: మెగాస్టార్‌తో మెహర్ రమేష్.. ఈ ఫ్లాప్ చిత్రాల దర్శకుడు ఈసారైనా హిట్ కొడతాడా?

తులా రాశి

ఈ వారం సమస్యలు ఉండొచ్చు. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులుంటాయి. అనవసర మాటలొద్దు. వారం చివరిలో మీరు బంధువులను కలవొచ్చు. స్నేహితులను కలుస్తారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం

ఈ వారం ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు. మీ ఆలోచన చాలా పాజిటివ్ గా ఉంటుంది. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు...కార్యాలయంలో జాగ్రత్త. మీ తెలివితేటలు వాడుకుని మీ పక్కవాళ్లు ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. రుణం మొత్తాన్ని తిరిగి పొందగలరు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది.

ధనుస్సు

ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు శుభసమయం. కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పని లాభాన్నిస్తుంది. చేపట్టిన పని ముందుకు సాగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగంలోకి మారొచ్చు. కెరీర్ ఊపందుకుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

మకరం

ఎవరైనా మీకు హాని కలిగించవచ్చు. లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో ప్రైవేట్ చర్చలు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పని ప్రదేశంలో ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వివాదాల్లో తలదూర్చొద్దు.

కుంభం

ఈ వారం మీరు చాలా బిజీగా ఉంటారు. శారీరక అలసట కారణంగా బలహీనంగా ఉన్నట్టు భావిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది..ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. చేపట్టిన పని సజావుగా సాగుతుంది. ఏ పనినీ వాయిదా వేయవద్దు. మీ మాటపై సంయమనం పాటించండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. సోమరితనం వద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండొచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి.

మీనరాశి

ఈ వారం కష్టపడాల్సి ఉంటుంది. గతంలో నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. కఠినంగా మాట్లాడకండి. అసభ్య పదజాలం ఉపయోగించవద్దు.  ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పిల్లలతో మంచి సమయం గడపండి. బంధువులను చాలా కాలం తర్వాత కలుసుకుంటారు. ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: ప్రభాస్ లుక్‌ చూసి అంతా షాక్.. ‘అంకుల్’ అంటూ నెటిజనులు ట్రోలింగ్

Also Read: ‘చెప్పు తెగుద్ది వె*వ’.. అమెరికా అధ్యక్షుడిపై హీరో నిఖిల్ ఆగ్రహం, ఎందుకంటే..

Also Read: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?

Also Read: పుష్ప రాజ్‌ని ఢీ కొట్టబోతోన్న IPS భన్వర్ సింగ్ షెకావత్.. తగ్గేదే లే అన్నట్టున్న ఫహద్ ఫస్ట్ లుక్..

 

 

Published at : 29 Aug 2021 08:52 AM (IST) Tags: Weekly Horoscope Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces August 29 to September 4th

సంబంధిత కథనాలు

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు దూకుడు తగ్గించుకుంటే మంచిది,సెప్టెంబర్‌ 29 న్యూమరాలజీ

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు దూకుడు తగ్గించుకుంటే మంచిది,సెప్టెంబర్‌ 29 న్యూమరాలజీ

Horoscope Today29th September: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today29th September: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Navratri 2022: ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

Navratri 2022:   ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

Zodiac signs: ఈ రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

Zodiac signs: ఈ రాశులవారికి  సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

టాప్ స్టోరీస్

KCR Temple Visits : జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

KCR Temple Visits :  జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన