weekly horoscope 06 to 12 May 2024: మే 6 నుంచి మే 12 వరకు ఈ వారం మీ రాశిఫలితం!
Weekly Horoscope: మే 06 సోమవారం నుంచి మే 12 వరకూ ఈ వారం ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి....
![weekly horoscope 06 to 12 May 2024: మే 6 నుంచి మే 12 వరకు ఈ వారం మీ రాశిఫలితం! weekly horoscope 06 to 12 May 2024 saptahik rashifal for aries taurus gemini leo cancer and other zodiac sign Vaara Phalalu i n telugu weekly horoscope 06 to 12 May 2024: మే 6 నుంచి మే 12 వరకు ఈ వారం మీ రాశిఫలితం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/05/ded4d5a5282eb8e8307f16d0bdb2bc3f1714882536926217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
weekly horoscope 06 to 12 May 2024
మేష రాశి
మేష రాశివారికి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు నెరవేరుతాయి. ఆస్తులకు సంబంధించి కొనసాగుతున్న వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఉద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు...అధిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ విషయంపైనా అతి విశ్లేషణ చేయకపోవడమే మీకు మంచిది.
వృషభ రాశి
ఈ రాశివారి ఈ వారం ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు శుభ ఫలితాలున్నాయి. మిమ్మల్ని కించపరిచే వారి మాటలు పరిగణలోకి తీసుకోవద్దు. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. అత్యవసరం అయితే కానీ ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.
మిథున రాశి
ఈ రాశివారికి ఈ వారం బావుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాల తీసుకోగలగుతారు. అయితే ఏ పని ప్రారంభించాలి అనుకున్నా ముందుగా ప్రణాళిక వేసుకోవడం అవసరం. కుటుంబంతో సంతోషం సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభఫలితాలున్నాయి.
Also Read: నేటి రాశిఫలాలు (05-05-2024)
కర్కాటక రాశి
ఈ రాశివారి అష్టమ శని ఉన్నప్పటికీ గురుబలం కలిసొస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మరో అడుగు ముందుకు వేసే సూచనలున్నాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. నిర్ణయాలు తీసుకునేముందు కుటుంబ సభ్యులతో ఓ సారి చర్చిస్తే మంచి జరుగుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసొస్తాయి. అనుకోని ధనం చేతికందుతుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో దానిని పూర్తి చేయడంపైనా అంతే ఉత్సాహాన్ని ప్రదర్శించాలి. గ్రహాలు అంత అనుకూలంగా లేవు..అందుకే ముఖ్యమైన విషయాల్లో మరోసారి ఆలోచించి అడుగు ముందుకు వేయండి. భక్తి పెరుగుతుంది.
Also Read: ఆదర్శ పాలకుడికి ఉండాల్సిన లక్షణాలివే - చాణక్య నీతి
కన్యా రాశి
ఈ రాశివారికి గ్రహబలం కన్నా మనోబలం అధికం.ఈ వారం మీకు అదృష్టం కూడా కలిసొస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది...కొత్తగా చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్నేహితులతో, సన్నిహితులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. సంపాదన కన్నా పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
తులా రాశి
ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. ఏ పని ప్రారంభించినా పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి కానీ వాయిదా అనే మాట రానివ్వొద్దు. కొన్ని విషయాల్లో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఫ్యూచర్ కోసం ప్రణాళికలు వేసేందుకు ఈ రోజు మంచిది. వ్యాపారంలో లాభాలొస్తాయి...నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. సన్నిహితుల మధ్య అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కోపం తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి.
Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!
ధనస్సు రాశి
ఈ వారం ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. వారం ఆరంభంలో అన్నీ చికాకులే. మీ చుట్టూ మిమ్మల్ని ముంచేవారున్నారు జాగ్రత్త. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించండి. వారం మధ్యలో పరిస్థితుల్లో మార్పులొస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆర్థిక లాభం ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది. శత్రువులు మిత్రులవుతారు. ఉద్యోగంలో స్థిరత్వం, గౌరవం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!
కుంభ రాశి
ఎప్పటి నుంచో వేసుకున్న ప్రణాళికలు కుంభ రాశివారు ఈ వారంలో అమలు చేస్తారు. మీలో ఉండే పాజిటివ్ థింకింగ్ మీకు ప్లస్ అవుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి.
మీన రాశి
గ్రహదోషాలు ఉన్నప్పటికీ మీ ధైర్యమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో మళ్లీ డైలమా ఉండకూడదు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)