అన్వేషించండి

Today Horoscope In Telugu: జులై 22 రాశి ఫలితాలు: ఆ రాశి వారికి ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది.

Horoscope Prediction 22nd july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 22nd 2024: 

మేషం

ఈ రాశి వారికి ఈరోజు భూమి కొనుగోలు విషయాలు ఫలిస్తాయి. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం

ఈ రాశి వారికి ఈరోజు  వృత్తి, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు.

మిథునం

ఈ రాశి వారు ఈరోజు రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ అవసరానికి డబ్బులు అందక ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు ఏర్పడతాయి. ఇతరులతో వాదనలు చేయకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు.

కర్కాటకం

ఈ రాశి వారు ఈరోజు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇంట్ల హ్యాపీగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

సింహం

ఈ రాశి వారికి  ఈరోజు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్థి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

కన్య

ఈరోజు ఈ రాశి వారికి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబం సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు కొంతమేరకు తీరుస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.

తుల

ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో విబేధాలు వస్తాయి. పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈరోజు  అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు

ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు పూర్తి చేయక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ఆర్థికంగా స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం ఉంది. సహ ఉద్యోగులతో తగువులు ఏర్పడే అవకాశం.

మకరం

ఈ రాశి వారికి  ఈరోజు బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దాయాదులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న విజయం సాధిస్తారు. ఇంట్లో పెద్దల సాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

కుంభం

ఈ రాశి వారికి ఈరోజు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మీనం

ఈరాశి వారికి  ఈరోజు  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - గురుపౌర్ణమి సందర్భంగా పంచాక్షరి మంత్రంలో మారుమోగుతున్న అగ్నిలింగ క్షేత్రం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget