Today Horoscope In Telugu: ఏప్రిల్ 06 రాశి ఫలాలు - ఈ రాశి వారికి ప్రయాణంలో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త
Horoscope Prediction 6th April 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for April 6th 2024:
మేషం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధు మిత్రుల సలహాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
వృషభం
కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి. అనవసరంగా ధన వ్యయం చేస్తారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిత్రులతో ఆకారణ కలహాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
మిథునం
వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికపరమైన విషయాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం
స్థిరాస్తి కొనుగోలుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావతనం నెలకొంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి.
సింహం
బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
కన్య
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు.
తుల
వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృశ్చికం
సొసైటీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సోదరులతో నెలకొన్న వివాదాలు సద్దుమనుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు.
ధనస్సు
అనారోగ్య సమస్యలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారాలలో స్వల్ప లాభాలుంటాయి. ఉద్యోగులకు పై అధికారులతో విభేదాలు ఉంటాయి.
మకరం
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాల వలన అనారోగ్య సూచనలు ఉన్నాయి.
కుంభం
కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశాజనక ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో లాభాలు వస్తాయి.
మీనం
అనారోగ్య సమస్యలు ఇబంది కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అవసరానికి డబ్బులు దొరకవు. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.
Note: ఒక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు.. మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
ALSO READ: ఈ ఉగాది నుంచి మొదలయ్యే తెలుగు సంవత్సరం పేరు , అర్థం ఏంటో తెలుసా!