అన్వేషించండి

Telugu Year Ugadi 2024 - 2025 Name: ఈ ఉగాది నుంచి మొదలయ్యే తెలుగు సంవత్సరం పేరు , అర్థం ఏంటో తెలుసా!

Telugu Year Ugadi 2024 to 2025 : తెలుగు సంవత్సరాలు 60. అంటే 60 ఏళ్లకోసారి సేమ్ ఇయర్ రిపీట్ అవుతుంది. 1904-1905, 1964-1965లో వచ్చిన క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు 2024 -2025 లో వస్తోంది...

Telugu Year Ugadi 2024 - 2025 Name: క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతోంది. ఇది తెలుగు సంవత్సరాల్లో 38వది. శోభకృత్ నామ సంవత్సరం పూర్తై క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. తెలుగు సంవత్సరాల పేర్లు ..వాటి అర్థాలు ఇక్కడ తెలుసుకోండి..

Also Read: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!

1. ప్రభవ - ప్రభవించునది ( పుట్టుక)
2. విభవ - వైభవంగా ఉండేది
3. శుక్ల -తెల్లనిది, నిర్మలమైనది, ఆనందానికి ప్రతీక
4. ప్రమోదూత - ఆనందం, ప్రమోదభరితంగా ఉండేది
5. ప్రజోత్పత్తి - రజ ఆంటే సంతానం- సంతాన వృద్ధి కలిగినదే ప్రజోత్పత్తి
6. అంగీరస -అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు
7. శ్రీముఖ - శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదని అర్ధం
8. భావ - భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ భావనారయణుడు
9. యువ - యువ అంటే బలానికి ప్రతీక
10. ధాత - బ్రహ్మ, ధరించేవాడు, రక్షించేవాడు
11. ఈశ్వర - పరమేశ్వరుడు
12. బహుధాన్య - సుభిక్షంగా ఉండటం.
13. ప్రమాది - ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
14. విక్రమ - విక్రమం కలిగిన వాడు.
15. వృష - చర్మం.
16. చిత్రభాను - భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
17. స్వభాను - స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ - తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
19. పార్థివ - పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
20. వ్యయ - ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.
21. సర్వజిత్తు-సర్వాన్ని జయించినది
22. సర్వధారి -సర్వాన్ని ధరించేది
23. విరోధి-విరోధం కలిగినటువంటిది
24. వికృతి-వికృతమైనది, నెగెటివ్ ఎనర్జీ
25. ఖర- గాడిద, కాకి, రాక్షసుడు
26. నందన- కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలిగించేది
27. విజయ- విశేషమైన జయం కలిగినది
28. జయ- జయాన్ని కలిగించేది 
29. మన్మథ- మనస్సును మధించేది
30. దుర్ముఖి - చెడ్డ ముఖం కలది
31. హేవిలంబి  - సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.
32. విలంబి  - సాగదీయడం.
33. వికారి  - వికారం కలిగినది.
34. శార్వరి  - రాత్రి.
35. ప్లవ  - తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.
36. శుభకృత్  - శుభాన్నిచ్చేది
37. శోభకృత్  - శోభను కలిగించేది.
38. క్రోధి  - క్రోధాన్ని కలిగినది.
39. విశ్వావసు  - విశ్వానికి సంబంధించినది.
40. పరాభవ  - అవమానం.
41. ప్లవంగ  - కోతి, కప్ప.
42. కీలక  -  పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.
43. సౌమ్య - మృదుత్వం.
44. సాధారణ  - సామాన్యం.
45. విరోధికృత్  - విరోధాలను కలిగించేది.
46. పరీధావి   - భయకారకం.
47. ప్రమాదీచ  - ప్రమాద కారకం.
48. ఆనంద  - ఆనందమయం.
49. రాక్షస  - రాక్షసత్వాన్ని కలిగినది.
50. నల   - నల్ల అనే పదానికి రూపాంతరం.
51. పింగళ  - ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52. కాలయుక్తి - కాలానికి తగిన యుక్తి.
53. సిద్ధార్థి - కోర్కెలు సిద్ధించినది.
54. రౌద్రి - రౌద్రంగా ఉండేది.
55. దుర్మతి - దుష్ట బుద్ధి.
56. దుందుభి  - వరుణుడు.
57. రుధిరోధ్గారి - రక్తాన్ని స్రవింప చేసేది.
58. రక్తాక్షి - ఎర్రని కన్నులు కలది.
59. క్రోదన - కోప స్వభావం కలది.
60. అక్షయ - నశించనిది

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Also Read: Ugadi Astrological Prediction 2024-2025: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget