చాణక్య నీతి: తక్కువ టైమ్ లో బాగా సంపాదించాలంటే! డబ్బంటే ఎవరికి చేదు..ఎంతున్నా ఇంకా కావాలనే ఆశ ఉంటుంది ఆశపడితే సరిపోదు దాన్ని నెరవేర్చుకోవాలంటే అందుకు తగిన ప్రయత్నం ఉండాలి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలంటే చాణక్యుడు చెప్పిన టిప్స్ ఇవే ధనవంతులు అవ్వాలంటే కృషి, సహనం ముఖ్యం..కష్టపడకుండా డబ్బువచ్చేయాలి అనుకోవడం అత్యాశ జీవితంలో విజయం, సంపద పొందాలంటే మీ మాటలు, ప్రవర్తన బావుండాలి క్రమ శిక్షణ లేని ఏ వ్యక్తి ఎప్పటికీ ధనవంతుడు కాలేడు లక్ష్యం ఏర్పరుచుకోవడమే కాదు..దాన్ని సాధించేవరకూ ఏకాగ్రతగా ఉన్నప్పుడే విజయం సాధిస్తారు ఏం జరుగుతుందో ఏంటో అంటూ చిన్న చిన్న విషయాలకే భయపడొద్దు..భయం పరాజయానికి తొలి మెట్టు కష్టాలు లేదా సవాళ్లకు భయపడే వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ఇలాంటి వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పటికీ ఉండవు అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్న జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలరు