అన్వేషించండి

Daily Horoscope Telugu 11th November 2023: నవంబరు 11 శనివారం ఛోటీ దీపావళి రోజు ఈ రాశులవారి లక్కు మామూలుగా లేదు!

Today Rasi Phalalu in Telugu: దిన ఫలాలు నవంబర్ 11, 2023 మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today Telugu 11th November (దిన ఫలాలు నవంబర్ 11, 2023)

మేష రాశి - Aries Horoscope in Telugu

ఈ రాశివారి ఇంట్లో సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంభాషణలో ఓపికగా ఉండండి. పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పిల్లల కారణంగా సంతోషం పెరుగుతుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. విద్యార్థులు ఉన్నత చదువులకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభ రాశి - Taurus Horoscope in Telugu

ఈ రాశివారికి మనసులో నిరాశ, అసంతృప్తి ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. కుటుంబం పట్ల సరైన శ్రద్ధ వహించండి. తల్లిదండ్రుల నుంచి సహకారం ఉంటుంది. విద్యార్థులకు కొన్ని ఆటంకాలుంటాయి.

Also Read: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు కొనితెచ్చుకున్నా శుభమే - తక్కువ ఖర్చే!

మిథున రాశి - Gemini Horoscope in Telugu

ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ మనసులో ఏదో కలవరపాటు ఉంటుంది. కాస్త ఓపికగా ఉండండి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. అధిక కోపాన్ని తగ్గించుకోవాలి. కొంతమంది పాత మిత్రులతో మళ్లీ పరిచయం ఏర్పడవచ్చు. ఖర్చులు అధికంగానే ఉంటాయి. మాటలో కర్కశత్వం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యా పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ వనరులు కూడా అభివృద్ధి చెందుతాయి

కర్కాటక రాశి - Cancer Horoscope in Telugu

ఈ రాశివారు కోపం తగ్గించుకోవాలి..విమర్శనాత్మకంగా మాట్లాడవద్దు. మాటల్లో పొదుపు పాటించండి. మీరు మీ ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని అదనపు బాధ్యతలను పొందవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కార్యాలయంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. 

సింహ రాశి - Leo Horoscope in Telugu

ఈ రాశివారికి ఈ రోజు కొన్ని ఒడిదొడుకులు ఉండొచ్చు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు చేపట్టే పనులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఓపికపట్టండి. మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. డబ్బు కొరత ఉండవచ్చు.

Also Read: మీ బంధుమిత్రులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

కన్యా రాశి - Virgo Horoscope in Telugu

ఈ రోజు ఈ రాశివారు ఆనందంగా ఉంటారు కానీ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మాట్లాడేటప్పుడు ఓసారి ఆలోచించండి.  ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరంగా శాంతిస్తారు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే మంచి సమయం. విద్యార్థులకు చదువులపై ఆసక్తి పెరుగుతుంది. మేధోపరమైన పనిలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం పెట్టుబడి పెట్టవచ్చు.

తులా రాశి - Libra Horoscope in Telugu

ఈ రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. లాభం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళ మరియు సంగీతం పట్ల మొగ్గు ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు రావచ్చు. మనసులో ప్రశాంతత, సంతోషం ఉంటుంది.

Also Read: యుగయుగాలుగా లక్ష్మీ ఆరాధన -ఇంతకీ దీపావళి రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి!

వృశ్చిక రాశి - Scorpio Horoscope in Telugu

మనసులో నిరాశ, అసంతృప్తి ఉంటుంది కానీ మాటల ప్రభావం పెరుగుతుంది. ఏదైనా ఆస్తి ఆదాయ వనరుగా మారవచ్చు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీరు స్నేహితుల నుంచి కూడా మద్దతు పొందుతారు. చదువులపై ఆసక్తి ఉంటుంది. విద్యా పనుల్లో విజయం సాధిస్తారు. మీరు పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది.  ఏ విషయంలోనూ అతి ఉత్సాహం, మితిమీరిన కోపం పనికిరాదు. 

ధనుస్సు రాశి - Sagittarius Horoscope in Telugu

ఈ రాశివారికి వ్యాపార పనులపై ఆసక్తి ఉంటుంది అయితే ఓపిక పట్టండి. అనవసర తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండండి. పురోగతికి అవకాశాలు ఉంటాయి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం వేరే ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసులో ప్రశాంతత, సంతోషం కలుగుతాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడతారు 

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!

మకర రాశి - Capricorn Horoscope in Telugu

సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటాపు. ఓపికగా కూడా ఉండండి. ఉద్యోగంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడతారు. మీరు కార్యాలయంలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుంచి మద్దతు పొందుతారు.

కుంభ రాశి - Aquarius Horoscope in Telugu

ఈ రోజంతా మనసు ఆనందంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం లోపించవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్‌లో ఉన్న కొంత డబ్బు తిరిగి రావచ్చు. సహనం తగ్గుతుంది . కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కూడబెట్టిన సంపదలో తగ్గుదల ఉంటుంది. అనవసర చింతలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి 

Also Read: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!

మీన రాశి - Pisces Horoscope in Telugu

కాస్త ఓపికగా వ్యవహరించండి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి.  ఆలోచనల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఉన్నత విద్యకోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో స్నేహితుని నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లల అనారోగ్యం మిమ్మల్ని బాధపెడుతుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget