![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Happy Dhanteras 2023: మీ బంధుమిత్రులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
Happy Dhanteras 2023 Wishes: ధన్‌తేరాస్ ఈ ఏడాది నవంబరు 11 శనివారం వచ్చింది. లక్ష్మీదేవిని ఆరాధించే ఈ రోజు నుంచి దీపావళి పండుగ సందడి ప్రారంభమలుతుంది..
![Happy Dhanteras 2023: మీ బంధుమిత్రులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి! Diwali 2023 Happy dhanteras 2023 whatsapp wishes and greetings and quotes in Telugu Happy Dhanteras 2023: మీ బంధుమిత్రులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/09/e873cba1f13fa893f43216911ee080bf1699499446412217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dhanteras 2023 Wishes In Telugu: ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి. ధన్వంతరి జయంతి, క్షీరసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈ రోజే. అందుకే ధన త్రయోదశి రోజు బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. ఆభరణాలను పూజలో పెట్టి లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తే సంపదకు కొదవ ఉండదని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ రోజు వెలిగిందే దీపం ఆయుష్షును ఇస్తుందని పండితులు చెబుతారు. ఐదు రోజుల దీపావళి వేడుకలో మొదటిరోజైన ధనత్రయోదశి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే |
ధన త్రయోదశి శుభాకాంక్షలు
Also Read: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు కొనితెచ్చుకున్నా శుభమే - తక్కువ ఖర్చే!
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం
స్వభక్తేభ్యోఽనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిమ్ ||
ధన త్రయోదశి శుభాకాంక్షలు
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశహస్తాయ సర్వామయవినాశనాయ
త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా |
ధన త్రయోదశి శుభాకాంక్షలు
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి
తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్ |
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
"ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయా
ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః||''
ధన త్రయోదశి శుభాకాంక్షలు
ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీం మహాలక్ష్మి ఏహ్యేహి
సర్వ సౌభాగ్యం దేహి మే స్వాహా ||
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
Also Read: యుగయుగాలుగా లక్ష్మీ ఆరాధన -ఇంతకీ దీపావళి రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి!
"ఓం హ్రీం శ్రీ క్రీం క్లీం
శ్రీ లక్ష్మీ మమ గృహే ధన పూరాయే, ధన పూరాయే
చింతయా దూర దూర స్వాహా ||
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
యా రక్తాంబుజవాసినీ విలాసినీ ఛన్దశు తేజస్వినీ|
యా రక్త రుధిరాంబర హరిశాఖీ యా శ్రీ మనోళాదినీ||
యా రత్నాకరమంథానాత్ప్రగతితా విష్ణోస్వయ గేహినీ|
సామాంపాతు మనోరమా భగవతీ లక్ష్మీశ్చ పద్మావతీ||
ధన త్రయోదశి శుభాకాంక్షలు
లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇల్లంతా సరిసంపదలతో నిండిపోవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
కొత్త కలలు, కొత్త ఆశలు నెరవేరి మీ జీవితంలో ప్రకాశవంతమైన క్షణాలు ఈ రోజు నుంచి ప్రారంభమవ్వాలి
ధన త్రయోదశి శుభాకాంక్షలు
Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!
శ్రీ మహాలక్ష్మి కరుణ, ఆరోగ్యాన్నిచ్చే ధన్వంతరి అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలి
ధన త్రయోదశి శుభాకాంక్షలు
మీ ఇంటిముందు వెలిగించే దీపకాంతులతో అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యం సిద్ధించాలని ప్రార్థిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
ఈ ధన త్రయోదశి మీకు సంపదను, విజయాన్ని, ఆరోగ్యాన్ని ఆందించాలి
హ్యాపీ ధన్‌తేరాస్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)