ఈ శతాబ్దపు అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడు? ఎంత సమయం భూమ్మీద చీకటి కమ్మేస్తుంది? భారతీయులు ఈ గ్రహణం చూడగలరా?
Longest Solar Eclipse: ఈ శతాబ్దపు అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎంత సమయం భూమ్మీద చీకటి కమ్మేస్తుంది? భారతీయులు ఈ గ్రహణాన్ని చూడగలరా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Surya Grahan 2nd August 2027: ఖగోళ శాస్త్రవేత్తలకు గ్రహణం చాలా అరుదైన , చరిత్రాత్మక సంఘటన. అదే సమయంలో ఖగోళ ప్రేమికులకు ఇది ఒక ఉత్తేజకరమైన అవకాశం. ఎందుకంటే వారు గ్రహణ సమయంలో ఆకాశంలో అరుదైన దృశ్యాన్ని చూస్తారు.
ప్రతి సంవత్సరం గ్రహణాలు ఏర్పడతాయి, కొన్ని పాక్షికంగా ఏర్పడితే కొన్ని సంపూర్ణ గ్రహణాలు ఏర్పడతాయి. కానీ సూర్యుడు పగటిపూట అదృశ్యమై ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది? నిముషం, రెండు నిముషాలు కాదు ఏకంగా 6 నిముషాల 23 సెకెన్లపాటూ భూమ్మీద చీకటి కమ్మేయనుంది.
ఈ శతాబ్ధానికి అతిపెద్ద సూర్యగ్రహణం ఇదే కానుంది. space.com ప్రకారం ఈ సూర్యగ్రహణం 1991 నుంచి 2114 మధ్య అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ గ్రహణంగా పరిగణిస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఈ శతాబ్దపు అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది?
శతాబ్దపు సుదీర్ఘ సూర్యగ్రహణం కోసం మీరు ఇంకా రెండేళ్లు వేచి ఉండాలి, ఎందుకంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న ఏర్పడుతుంది. అయితే, ఈ గ్రహణం దాని అసాధారణమైన పొడవైన సమయం కారణంగా ఇప్పటి నుంచే వార్తల్లో నిలుస్తూ వస్తోంది. సాధారణంగా సంపూర్ణ సూర్యగ్రహణాలు కూడా 3 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ఉంటాయి, అయితే 2027లో ఏర్పడే ఈ గ్రహణం శతాబ్దంలోని అన్ని గ్రహణాల రికార్డులను బద్దలు కొడుతుంది. ఈ గ్రహణం ఎక్కడైతే కనిపిస్తుందో, అక్కడి ప్రజలు తమ జీవితకాలంలో ఇలాంటి అనుభవాన్ని మొదటిసారి పొందుతారు.
భారతీయులు ఈ శతాబ్దపు సుదీర్ఘ సూర్యగ్రహణాన్ని చూడగలరా?
భారతదేశ సమయం ప్రకారం గ్రహణం మధ్యాహ్నం 3:34 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:53 గంటలకు ముగుస్తుంది. భారతీయులు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడలేరు కానీ పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడగలరు. ఆగష్టు నెల అంటే వానాకాలం..కాబట్టి వాతావరమం అనుకూలిస్తే సాయంత్రం 4:30 గంటలకు కొన్ని నగరాల్లో ప్రజలు గ్రహణాన్ని చూడగలరు.
నియమాలు పాటించాలా?
సాధారణంగా కొన్ని గ్రహణాలు మనకు కనిపించవు..అలాంటప్పుడు గ్రహణ నియమాలు పాటించాల్సన అవసరం లేదు. ఎప్పుడైతే మనదేశంలో గ్రహణం కనిపిస్తుందో సూతకాలం పాటించాల్సిందే.
ఎక్కడెక్కడ కనిపిస్తుంది
ఈ సుదీర్ఘ సూర్యగ్రహణం భారతదేశంతో పాటు, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో కూడా కనిపిస్తుంది. ఇందులో ఉత్తర మొరాకో, అల్జీరియా, దక్షిణ ట్యునీషియా, ఈశాన్య లిబియా, లక్సర్, నైరుతి సౌదీ అరేబియా, యెమెన్, ఈజిప్ట్ సహా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
నిరాకరణ: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఏబీపీ దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు, అమలు చేసే ముందు సంబంధిత నిపుణల అభిప్రాయం కూడా తీసుకోవడం మంచిది.
శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి





















