అన్వేషించండి

పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు! మహాభారతంలో ఉన్న ఆ రహస్యం ఏంటి?

Weather: పిడుగు పడేటప్పుడు పెద్దశబ్ధం వస్తుంది. ఈ శబ్ధం విని ఎరైనా భయపడితే అర్జునా, ఫల్గుణా అంటూ వరసగా పదినామాలు జపిస్తారు. పిడుగులకు అర్జునుడిని జపించడానికి ఏంటి సంబంధం

Mahabharat

అర్జునుడి పేరెత్తితే పిడుగుల భయం పోతుందా?

అర్జునుడిని తలుచుకుంటే భయం పారిపోతుందా?

అర్జునుడికి పిడుగులకు ఏంటి సంబంధం?

మహాభారతంలో దీనికి సంబంధించి ఏముంది?

అర్జునుడి పేర్లు వరుసగా ఎందుకు తల్చుకోవాలి? వాటి వెనుకున్న అర్థమైంటి? 

 ఇదంతా అర్థంకావాలంటే మహాభారతంలో ఓ సందర్భాన్ని చెప్పుకోవాలి....

అర్జునః ఫాల్గుణః పార్థా కిరీటీ శ్వేతవాహనా
బీభత్స విజయః కృష్ణ సవ్యసాచి ధనుంజయః “

ఇవన్నీ అర్జునుడి బిరుదులే. ఇవి  పిడుగు పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినపుడు కూడా జపించవచ్చు. మహాభారతం లో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది.

పాండవులు అరణ్యవాసం పూర్తైన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ అజ్ఞాతవాసాన్ని గడుపుతుంటారు. విరాటుడి కొలువులో అర్జునుడు విరాట మహారాజు కుమార్తె ఉత్తరకి  నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు. పాండవులు అక్కడ ఉన్నారని తెలుసుకుని వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి విరాటరాజు రాజ్యంపై దండయాత్ర చేస్తారు. అప్పుడు ఉత్తరకుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వ్యవహరిస్తారు. అయితే కౌరవ సైన్యం  లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు ఉత్తరుడు. అప్పుడు ఉత్తరుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి..శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకు రమ్మని చెబుతాడు. 

అప్పటికే పూర్తిగా భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు. నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు. అర్జునుడికి కిరీటి, సవ్యసాచి, ఫాల్గుణ, పార్థ, విజయుడు ఇలా ఎన్నో నామాలున్నాయి.. ఒకదాని తరవాత ఒకటి, అర్జునుడు తన నామాల వెనక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు.

గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారు

ఎంతటి వీరుడి నైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అని పిలుస్తారు

దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరీటి అంటారు

కుంతీ దేవి అసలు పేరు పృథ.. ఆమెకు జన్మించడం వలన పార్ధుడు అయ్యాడు

ఉత్తర ఫల్గునీ నక్షత్రం - పూర్వ పాల్గుని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల తనని ఫాల్గుణ అంటారని అర్జునుడు తన నామాలకు అర్ధాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడికి అర్థమయ్యేలా చెప్పి అక్కడున్నవారి భయం పోగొడతాడు.

ఫాల్గుణ నామం వెనుక ఉన్న అర్థం ఇదే. ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే ఆ ప్రభావం, ఆ భయం ఉండదని ధైర్యం వస్తుందని చెబుతారు.

శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?
దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?
అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget