అన్వేషించండి

September Born: బయటకు కంచు లోపల మంచు..సెప్టెంబర్ లో పుట్టినవారి మనస్తత్వం ఇలా ఉంటుంది!

Astrology: పుట్టిన తేదీ ,సమయం,రాశి ఆధారంగా మనస్తత్వాన్ని , భవిష్యత్ ను అంచనా వేస్తారు జోతిష్య శాస్త్ర పండితులు. అయితే జన్మించిన నెల ఆధారంగా కూడా చెప్పొచ్చు..మీరు సెప్టెంబరులో జన్మిస్తే ఇలా ఉంటారు

The Best Traits of September Born:  ఎండల వేడి తగ్గి వాతావరణం మొత్తం చల్లగా మారే సమయం సెప్టెంబరు. మిగిలిన నెలల కన్నా చాలామంది జన్మదినోత్సవాలు ఈ నెలలోనే ఎక్కువగా ఉంటాయంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. మిగిలిన 11 నెలల కన్నా సెప్టెంబరు నెలలో జన్మించినవారు చాలా తొందరగా సక్సెస్ అవుతారట...నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. అంత స్పెషల్ క్వాలిటీస్ వారిలో ఏమున్నాయో ఇక్కడ తెలుసుకుందాం...

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

స్వయం కృషి
సెప్టెంబరులో జన్మించినవారు స్వయంకృషితో పైకొస్తారు. కష్టాన్ని నమ్ముకుంటారు..పడిన కష్టానికి మాత్రమే ఫలితం ఆశిస్తారు. ఆయాచితంగా వచ్చే దేన్నీ వీరు అంగీకరించరు. చాలా చురుకైన మనస్తత్వం కావడంతో జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు. 

తొందరపాటు
వీళ్లకి ఎంత తొందరపాటు అంటే...ఆలోచన రావడమే తడవు వెంటనే అమలు చేసేయాలి అనుకుంటారు...చేసేస్తారు కూడా. అయితే వాటివల్ల ఎక్కువసార్లు లాభపడినా అప్పడప్పుడు నష్టపోతారు

ఓ పద్ధతి విధానం
సెప్టెంబరు లో పుట్టినవారు ప్రతి విషయంలో ఓ పద్ధతి, విధానం అనుసరిస్తారు. ఎలా అంటే అలా ఉండడం, అప్పటికప్పుడు హడావుడి చేయడం వీళ్లకి అస్సలు ఇష్టం ఉండదు. ఓ ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తారు. అందుకే ఈ నెలలో జన్మించినవారు లాయర్లు, వక్తలుగా రాణిస్తారు. వీల్ల ఆలోచన వీరిదే కానీ ఎదుటివారి అభిప్రాయాలను అస్సలు పరిగణలోకి తీసుకోరు. కానీ వీరిచ్చే సలహాలు , సూచనలు ఎదుటివారికి చాలా ఉపయోగపడతాయి.

Also Read:  ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు

వ్యక్తిగత జీవితం
ఈ నెలలో జన్మించినవారు ప్రేమలో సక్సెస్ అవుతారు కానీ ఆ ప్రేమ నిలబడదు. వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు తప్పవు. పుట్టినప్పటి నుంచి కష్టాలతోనే మొదలవుతుంది..మొత్తం శ్రమతోనే గడుస్తుంది. చెడు సహవాసాలకు దూరంగా ఉంటేనే వీరు జీవితంలో సక్సెస్ అవుతారు. బయటకు కరుకుగా కనిపిస్తారు కానీ వీరి మనసు అత్యంత సున్నితమైనది. పరిస్థితులు వీరికి ఎప్పుడూ అనుకూలంగా ఉండవు కానీ వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అవుతారు. ఎదుటివారిని బాధపెట్టరు కానీ వారి ప్రవర్తన కారణంగా మానసికంగా గాయపడతారు. 
 
విద్య
చదువులో కూడా ఈ నెలలో జన్మించినవారి రూటే సెపరేటు. అందరి విద్యార్థులకన్నా వీరు భిన్నంగా ఉంటారు. సృజనాత్మక ఆలోచనలు అధికం. ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉంటారు. ఉన్నతవిద్యలో వెలుగుతారు. కళలు, సంగీతం, నృత్య రంగాల్లో ప్రతిభ ప్రదర్శిస్తారు.  సమయం దొరికితే చాలు వీరి చేతిలో పుస్తకం ఉంటుంది..చదవడం అంటే చాలా ఇష్టం...

ఆరోగ్యం
ఈ నెలలో జన్మించినవారి ఆరోగ్యం బావుంటుంది. ఆహారం తీసుకోవడంలోనూ ఓ ప్రత్యేక నియమం పాటిస్తారు. వీరి అభిరుచులు వేరుగా ఉంటాయి. మిగిలిన నెలల్లో కన్నా సెప్టెంబరు, నవంబరు నెలల్లో జన్మించినవారు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎందుకంటే ఈ నెలలో పుట్టిన వారు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులకు ఎక్కువ గురవుతారు..తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి ఎక్కువ కాలం జీవిస్తారట. ఎక్కువగా ఊపిరితిత్తులు, చేతులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి.  

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

సహాయం
అందరూ కావాలనుకుంటారు..అందరితో స్నేహపూర్వకంగా కలసిపోతారు. తమ వల్ల సాధ్యం అవుతుంది అనుకుంటే ఎంతకష్టమైనా కానీ సహాయం చేసేందుకు వెనుకాడరు. వీరి ఆలోచనా విధానం, ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటాయి.

సెప్టెంబరులో జన్మించిన వారు కుదురుగా ఓ చోట ఉండేందుకు ఆసక్తి చూపించరు..ఎక్కువగా ప్రయాణాలు చేయడంపై ఆసక్తి ప్రదర్శిస్తారు. ప్రకృతి మధ్య గడపడం వీరికి మహా ఇష్టం  

Also Read:   మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget