ఆగష్టు 30 రాశిఫలాలు - ఈ రాశివారు తీరు సక్రమంగా ఉన్నప్పటికీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది!
Horoscope Prediction 30 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 30 August 2024
మేష రాశి
ఈ రోజు డబ్బుకు సంబంధించిన విషయాలలో కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు. సహోద్యోగులతో విభేదాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
వృషభ రాశి
వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఓపికగా అన్ని పనులు పూర్తి చేస్తారు. సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుగ్రహం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది
మిథున రాశి
ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీ స్వభావాన్ని అదుపులో ఉంచుకోండి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. మీ సరైన చర్యలపై కూడా వ్యతిరేకత పెరుగుతుంది.
Also Read: ఈ 8 ఆలయాలను రెండు రోజుల్లో చుట్టేయవచ్చు.. వినాయకచవితికి ప్లాన్ చేసుకోండి!
కర్కాటక రాశి
మీ మనసులో ఎవరి పట్ల ద్వేషాన్ని ఉంచుకోవద్దు. కార్యాలయంలో సబార్డినేట్ ఉద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. ఉన్నతాధికారుల సహకారం అందుతుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
సింహ రాశి
అతి విశ్వాసం తగ్గించుకోవాలి. ఏదైనా పొరపాటు వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. ఏ విషయంలోనూ ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడొద్దు. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలుంటాయి.
కన్యా రాశి
ఈ రోజు మీరు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు పొందవచ్చు. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు.
తులా రాశి
ప్రియమైనవారితో వివాదాలకు దూరంగా ఉండండి. సోమరితనం వల్ల చేయాల్సిన పనిని వాయిదా వేస్తారు. చర్చలలో భాగంగా పరుష పదాలను ప్రయోగించవద్దు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటారు. పని ప్రదేశాలలో తలెత్తే సమస్యలు నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు.
ధనస్సు రాశి
వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగం, వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందలు ఉండొచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
Also Read: వినాయకుడి రాశి ఏంటి -గణనాథుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండే రాశులేంటి!
మకర రాశి
ఈ రోజు మీరు కోరుకున్న ఫలితాలను సాధిస్తారు. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బులు అనుకోకుండా చేతికి తిరిగొస్తాయి. ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కుంభ రాశి
ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారలలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అప్పులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది
Also Read: మీ రాశి ప్రకారం మీరు పూజించాల్సిన వినాయకుడి రూపం ఇదే!
మీన రాశి
మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది. పనిపై ఎంత శ్రద్ధ వహిస్తున్నారో..విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే అవసరం అని గుర్తించండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.