Shukra Gochar In Mesh 2024: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!
Venus Transit 2024 in Aries: మేష రాశిలో శుక్ర సంచారం ఈ రాశులవారికి మంచి ఫలితాలనిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

Shukra Gochar In Mesh 2024: ఏప్రిల్ 24 న మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడు మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం ఈ ఏడు రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలనే ఇస్తోంది...
మేష రాశి (Aries)
శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఈ రాశి వారికి శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా సర్దుకుంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి (Gemini)
మేష రాశిలో శుక్రుడి సంచారం మిథున రాశివారికి శుభ ఫలితాలనిస్తోంది. క్రియేట్ ఫీల్డ్ లో ఉండేవారికి మంచి జరుగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. కెరీర్ వృద్ధి చెందుతుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే సరైన సమయం. రాజకీయాల్లో ఉన్నవారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు.
Also Read: మే 19 వరకూ ఈ 4 రాశులవారికి చుక్కలే - ముఖ్యంగా మాట జాగ్రత్త!
కర్కాటక రాశి (Cancer)
మీ రాశి నుంచి పదో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఏప్రిల్ 24 నుంచి మే 19 వరకూ మీకు మంచి ఫలితాలే ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది...ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టిన వారికి మంచి జరుగుతుంది.
సింహ రాశి (Leo)
తొమ్మిదో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల సింహరాశివారు లాభపడతారు. ఏ పని ప్రారంభించినా పూర్తిచేస్తారు. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి.
Also Read: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!
వృశ్చిక రాశి (Scorpio )
ఆరో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి రాజకీయ నాయకులకు మంచి జరుగుతుంది శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల పై మీరు పైచేయి సాధిస్తారు. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేసినా విజయం వరిస్తుంది. మీ కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వపరంగా ప్రయోజనాలు అందే అవకాశముంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
శుక్రుడి సంచారం మీకు మంచి అవకాశాలను అందిస్తుంది. కెరీర్లో విజయం సాధిస్తారు. మీ బంధాలు బలపడతాయి. వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి సమయం కలిసొస్తుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ బంధాలు బలపడతాయి.
Also Read: రాజకీయ నాయకుల విమర్శలలో వినిపించే 'పాపాల భైరవుడు' పురాణాల్లో ఉన్నాడా!
మకర రాశి (Capricorn)
ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నాలుగో స్థానంలో శుక్రుడి సంచారం మీ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకున్నవారి కల నెరవేరుతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ప్రయోజనాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు లాభపడతారు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

