Rasi Phalalu Today: జూన్ 20, 2025 - మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు - ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Horoscope for June 20th 2025 : మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం, ధనానికి సంబంధించి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోండి.

2025 జూన్ 20 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 20th 2025
మేష రాశి (Aries) జూన్ 20, 2025
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు ఏదైనా కంపెనీ నుంచి ఆఫర్ కాల్ పొందొచ్చు. కొత్త కోర్సులో చేరడానికి ఈ రోజు శుభ దినం. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు విదేశాలకు వెళ్లవలసి రావచ్చు. ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడులకు ఈ రోజు మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీ పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి (Taurus) జూన్ 20, 2025
ఈ రోజు మీకు సంతోషాన్నిస్తుంది. వ్యాపార పనులపై దూరప్రాంతం ప్రయాణం చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సలహా మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయరంగంలో ఉండేవారికి ఈ రోజు మంచిది. విద్యార్థులు ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై ఉంటుంది.
మిథున రాశి (Gemini) జూన్ 20, 2025
ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. స్నేహితుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు ఇఫ్పుడు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో మీరు ఏదైనా పెద్ద పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు.
కర్కాటక రాశి (Cancer) జూన్ 20, 2025
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. భవిష్యత్ లో మీకు ఉపయోగపడే వ్యక్తిని ఈ రోజు కలిసే అవకాశం ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. ఈ రాశి అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. క్రీడలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు.
సింహ రాశి (Leo) జూన్ 20, 2025
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది కానీ చేపట్టిని పనిలో సవాళ్లు ఎదుర్కోకతప్పదు. వాటిని ఓపికతో పరిష్కరించుకుంటారు. ఈ రోజు మీరు మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు కంప్యూటర్ సంబంధిత వస్తువులను కొనడం శుభప్రదం. కుటుంబ సంబంధాలు బలపడతాయి. పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు మీకు శుభ దినం.
కన్యా రాశి (Virgo) జూన్ 20, 2025
ఈ రోజు పాత ఆలోచనల నుంచి బయటపడతారు. మీ ఆలోచనా విధానానికి కుటుంబ సభ్యులు ఫిదా అవుతారు. నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కెరీర్‌ను కొత్తగా ప్రారంభించాలని ఆలోచిస్తున్న ఈ రాశి వారికి ఈ రోజు శుభ దినం. స్నేహితులను కలుస్తారు. జీవిత భాగస్వామితో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
తులా రాశి (Libra) జూన్ 20, 2025
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభపడతారు. ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. ఎవరికైనా ఇచ్చిన డబ్బు ఈ రోజు తిరిగి పొందుతారు. అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి న్యాయవాదులకు ఈ రోజు ముఖ్యమైనది. అన్ని కేసులు వారికి అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.
వృశ్చిక రాశి (Scorpio) జూన్ 20, 2025
ఈ రోజు మీకు ఉపశమనంతో నిండి ఉంటుంది. మీ వ్యాపారంలో మీకు ప్రయోజనం చేకూర్చే వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తనను సానుకూలంగా ఉంచుకోవాలి. కళా రంగంలో ఉంటే, ఈ రోజు మీకు పెద్ద వేదికపై ప్రదర్శన చేసే అవకాశం లభిస్తుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు.
ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 20, 2025
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా వ్యాపార సమావేశంలో పాల్గొంటారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఈ రాశికి చెందిన వ్యాపారులు ఈ రోజు ఏదైనా పెద్ద కంపెనీతో తమ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటారు.. ఇది మీకు భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రోజు మీరు పని రంగంలో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు.
మకర రాశి (Capricorn) జూన్ 20, 2025
ఈ రోజు మీకు బాగుంటుంది. మీ పరిచయస్తులతో ప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తారు. మార్కెటింగ్ కు సంబంధించిన వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు. ఈ రోజు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ మీ పని రంగంలో ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ రోజు అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.
కుంభ రాశి (Aquarius) జూన్ 20, 2025
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తిని సరైన స్థలంలో ఉపయోగిస్తే ఫలితం బాగుంటుంది. రచనలు చేసే వ్యక్తులు ఈ రోజు సత్కారాలు అందుకుంటారు. లవ్ మేట్ నుంచి ఈ రోజు మీకు నచ్చిన బహుమతి లభిస్తుంది. కుటుంబానికి సమం కేటాయించండి. శుభకార్యానికి హాజరవుతారు.
మీన రాశి (Pisces) జూన్ 20, 2025
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. విదేశీ కంపెనీ నుంచి ఉద్యోగం కోసం కాల్ రావొచ్చు. వ్యాపారులు తమ ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి, అలాగే కాగితపు పనిలో జాగ్రత్త వహించాలి. చట్టపరమైన విషయంలో మీకు కొంత ఉపశమనం లభించవచ్చు. అత్యాధునిక సమాచార మాధ్యమాలు మరియు ఆధునిక పరికరాలు మీ పని చేసే విధానంలో మార్పు తెస్తాయి. కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకుంటారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















