2025 నవంబర్ 4 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Daily Horoscope in Telugu: 2025 నవంబర్ 4 న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025 నవంబర్ 03 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 3 November 2025
మేష రాశి (Aries Horoscope)
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారంలో అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీసుకోవద్దు. కుటుంబ కలహాలు జీవిత భాగస్వామి సహాయంతో తొలగిపోతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. పాత స్నేహితుడితో సమావేశం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. గుడ్డిగా ఎవరినీ నమ్మవద్దు. సానుకూల ఆలోచన మార్గాన్ని సుగమం చేస్తుంది.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: ఎరుపు
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి
వృషభ రాశి (Taurus Horoscope)
ఈ రోజు మీకు శుభం జరుగుతుంది. ప్రస్తుతం నూతనపెట్టుబడి పెట్టకుండా ఉండండి ఎందుకంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సహకారంతో... నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో శృంగార క్షణాలు గడిపే అవకాశం లభిస్తుంది.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: గులాబీ
పరిహారం: లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించండి
మిథున రాశి (Gemini Horoscope)
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. పనిచేసే ప్రదేశంల మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి సహకారం పొందే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల గౌరవం పెరుగుతుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు, వాటిని ప్రశాంతంగా పరిష్కరించుకోండి.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: గణేశుడికి దూర్వను సమర్పించండి
కర్కాటక రాశి (Cancer Horoscope)
ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది.ఓ సీనియర్ అధికారి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా ప్రాజెక్ట్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో స్వల్ప ఉద్రిక్తత ఉండవచ్చు, కానీ పరిస్థితి చక్కబడుతుంది.
అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: తెలుపు
పరిహారం: బియ్యం దానం చేయండి
సింహ రాశి (Leo Horoscope)
ఈ రోజు మధ్యస్తంగా ఉంటుంది. కొన్ని పనులు నిలిచిపోవచ్చు, కానీ ఓపికతో ఉండటం వల్ల పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులు విదేశాల నుంచి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు..సంయమనంతో వ్యవహరించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు, జాగ్రత్త వహించండి. ప్రేమ జీవితంలో విభేదాలను నివారించండి. పనిచేసే ప్రదేశంలో కష్టం ఫలిస్తుంది
అదృష్ట సంఖ్య: 1
అదృష్ట రంగు: బంగారు
పరిహారం: సూర్య భగవానుడికి నీరు సమర్పించండి
కన్యా రాశి (Virgo Horoscope)
ఈ రోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. చల్లని వాతావరణం కారణంగా బద్ధకంగా అనిపించవచ్చు. ఆదాయంలో స్వల్ప తగ్గుదల..ఖర్చులలో పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది, పెద్ద ఆర్డర్ పొందవచ్చు. ప్రేమ జీవితంలో ఒత్తిడి పెరగుతుంది. మీ మాటలను నియంత్రించండి. వైవాహిక జీవితంలో ప్రేమ .. అవగాహన కొనసాగుతుంది. పాత స్నేహితుడి సలహా వల్ల ప్రయోజనం ఉంటుంది.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: తులసికి నీరు సమర్పించండి
తులా రాశి (Libra Horoscope)
ఈ రోజు ఉపశమనం కలిగిస్తుంది. పనిచేసే ప్రదేశంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందం నుంచి లాభం వస్తుంది. కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు ప్రశాంతంగా ఉంటూ పరిస్థితిని అనుకూలంగా మార్చండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు. మిమ్మల్ని మీరు బిజీగా మరియు సానుకూలంగా ఉంచుకోండి.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: నీలం
పరిహారం: దుర్గామాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి
వృశ్చిక రాశి (Scorpio Horoscope)
ఈ రోజు పురోగతి ఉంటుంది. పని చేసే ప్రదేశంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొత్త వస్తువు లేదా సౌకర్యాన్ని పెంచే వస్తువును కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ప్రయాణాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితులతో వాగ్వాదానికి దిగవద్దు.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: మెరూన్
పరిహారం: నీటిలో ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానుడికి సమర్పించండి.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope)
ఈ రోజు మీకు శృంగారభరితంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహన బలపడుతుంది. కుటుంబంతో గడపడం వల్ల మనస్సు సంతోషిస్తుంది. వ్యాపారంలో కొత్త లాభ అవకాశాలు లభిస్తాయి. మీ తెలివితేటలతో మీరు పెద్ద ఒప్పందం కుదుర్చుకోవచ్చు. సోదరుల సహకారం లభిస్తుంది. ఆహారం విషయంలో సంయమనం పాటించండి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: పసుపు
పరిహారం: అరటి చెట్టును పూజించండి
మకర రాశి (Capricorn Horoscope)
స్నేహితులతో వివాదం ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి మీ మాటలను , కోపాన్ని నియంత్రించండి. మనస్సులో అయోమయం ఉంటుంది, దానిని సన్నిహితుడితో మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోండి. సామాజిక కార్యక్రమాల ద్వారా గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించండి
అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: నీలం
పరిహారం: శని దేవుడికి ఆవాల నూనె సమర్పించండి
కుంభ రాశి (Aquarius Horoscope)
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, కడుపు నొప్పిసమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ వాతావరణం బాగుంటుంది . వ్యాపారంలో కష్టపడితే విజయం లభిస్తుంది. వైవాహిక జీవితం ప్రేమమయంగా ఉంటుంది.
అదృష్ట సంఖ్య: 4
అదృష్ట రంగు: ఊదా
పరిహారం: శివుడికి నీటితో అభిషేకం చేయండి
మీన రాశి (Pisces Horoscope)
ఈ రోజు మీకు మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా కొత్తపని చేయాలని నిర్ణయించుకుంటారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.నూతన పెట్టుబడులు భవిష్యత్తును బలోపేతం చేస్తాయి. ప్రేమ జీవితంలో చిన్న విషయాల గురించి వివాదాలను నివారించండి, లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులతో సమన్వయంతో ఉండండి. మానసిక శాంతి కోసం ధ్యానం చేయండి.
అదృష్ట సంఖ్య: 7
అదృష్ట రంగు: ఆకాశం
పరిహారం: విష్ణు సహస్రనామం పఠించండి
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















