News
News
వీడియోలు ఆటలు
X

Political Horoscope: 2023-2024 ఈ రాశులకు చెందిన రాజకీయనాయకులకు గడ్డుకాలమే!

2023-2024 రాజకీయ జాతకం: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Political Horoscope 2023-2024: ఏటా ఉగాది నాటికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం అవమానం సహా ఆ ఏడాది గ్రహసంచారం ఎలా ఉందో తెలుసుకుంటారు.  మరి రాజకీయాల పరంగా చూస్తే ఏ ఏ రాశులవారిని విజయం వరిస్తుంది...ఏ ఏ రాశుల రాజకీయ నాయకులకు గ్రహాల అనుగ్రహం లేదో చూద్దాం...

మేష రాశి

ఈ ఏడాది మేషరాశి రాజకీయనాయకులకు శనిబలం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రజల్లో - అధిష్టానం నుంచి మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ రాశి వారు ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తే విజయం తథ్యం.

వృషభ రాశి

వృషభ రాశికి చెందిన రాజకీయనాయకులకు కూడా శోభకృత్ నామ సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుంది. శత్రువులు ఎన్ని స్కెచ్చులేసినా మీదే పైచేయి. ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతారు.

మిథున రాశి

మిథున రాశికి చెందిన రాజకీయనాయకులకు ఈ ఏడాది బావుంటుంది. ఎన్నికల్లో పోటీచేస్తే విజయం సాధిస్తారు. మంచి పదవి పొందుతారు. అధిష్టానం అనుగ్రహం పొందుతారు.

Also Read: 2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

కర్కాటక రాశి

ఈ రాశివికి చెందిన రాజకీయ నాయకులకు గురుబలం బాగా కలిసొస్తుంది. అధిష్టానం నుంచి మంచి మార్కులు కొట్టేస్తారు..ప్రజల్లో పలుకుబడి పెంచుకోగలుగుతారు. ఈ రాశివారు ఎన్నికల్లో పోటీచేస్తే..చివరకి వరకూ విజయం దోబూచులాడినా ఎట్టకేలకు విజేతగా నిలుస్తారు. అయితే శని ప్రభావం వల్ల మనోధైర్యం కోల్పోతారు..శత్రువుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహ రాశి

సింహ రాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రజల్లో, అధిష్టానం దృష్టిలో మంచి పేరు ఉన్నప్పటికీ పదవుల్లో వెలిగే అవకాశాలు తక్కువే ఉన్నాయి. విజేతలుగా నిలవలేరు. గెలుపు దరిచేరింది అనిపించినా చివరి నిముషంలో సమీకరణాలు మారిపోతాయి. డబ్బులు ఖర్చు అయినా అందుకు తగిన ఫలితం దక్కడం కష్టమే

కన్యా రాశి

కన్యా రాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది అనుకూలంగా లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పొందుతారు. అధిష్టాన వర్గంలోనూ మీపై సదభిప్రాయం ఉండదు. ఎన్నికల్లో పోటీచేసినా విజయం సాధిస్తారనే నమ్మకం లేదు..శత్రువర్గం ఆరోపణల వలయంలో చిక్కుకుంటారు

తులా రాశి

తులా రాశి రాజకీయనాయకులకు శోభకృత్ నామసంవత్సరం అనుకూలంగా లేదు. గ్రహసంచారం బాగా లేకపోవడం వల్ల పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రజల్లో మీపై ఉన్న విశ్వాసం తగ్గుతుంది.  అధిష్టాన వర్గంలోనూ మీపేరు, గుర్తింపు తగ్గుతుంది. శత్రువులవలన ఇబ్బందులు ఉండొచ్చు. నమ్మినవారే దగాచేస్తారు. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది కానీ ఫలితం ఉండదు

వృశ్చిక రాశి

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశికి చెందిన రాజకీయ నాయకులకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అధిష్టాన వర్గం నుంచి ప్రశసంలుంటాయి. ప్రజల సమస్యలు పరిష్కరించే మంచి నాయకుడిగా పేరు సంపాదిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మీ ముందు మోకరిల్లుతారు.ఎన్నికల్లో పోటీచేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారు..

Also Read: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

ధనస్సు రాశి

ధనస్సు రాశి రాజకీయ నాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం సువర్ణావకాశం. ప్రజాభిమానం విశేషంగా పొందుతారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. అధిష్టాన పరంగా మంచి పేరు సంపాదించుకుంటారు. ఎన్నికల్లో పోటీచేస్తే విజయం మీదే అవుతుంది. శత్రువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి

మకర రాశి

మకర రాశి రాజకీయనాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బాగా కలిసొస్తుంది. గతేడాదికన్నా అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ప్రజల్లో ఫాలోయింగ్ పెరుగుతుంది..అధిష్టానం నుంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు కూడా మీకు సహాయపడతారు

కుంభ రాశి

కుంభ రాశికి చెందిన రాజకీయనాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం గడ్డుకాలమనే చెప్పాలి. ప్రజల్లో మీపై విశ్వాసం ఉండదు. అధిష్ఠాన వర్గంలోనూ సదభిప్రాయం ఉండదు. గతంలో కన్నా మీపై వ్యతిరేకత పెరుగుతుంది..నమ్మినవారే దగా చేస్తారు. మీతో ఉన్నవారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు జాగ్రత్త...

మీన రాశి

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీన రాశికి చెందిన రాజకీయనాయకులకు అంత అనుకూలంగా లేదు. ప్రజలు, అధిష్టానం నుంచి మంచి పేరు పొందలేరు. ఎన్నికల్లో పోటీచేసినా ఓటమి పాలవక తప్పదు. పార్టీలు మారే పరిస్థితి ఉంటుంది. డబ్బు అధికంగా ఖర్చు చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది

Published at : 01 Apr 2023 06:41 AM (IST) Tags: Horoscope Political Horoscope 2023-2024 political Grah Gochar Aries political career 2023 2024 poliotical astrological prediction

సంబంధిత కథనాలు

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి