Medical Astrology: మీ అనారోగ్య సమస్యలను నిర్ణయించేది మీ రాశిచక్రమే - ఏ రాశివారికి ఎలాంటి వ్యాధులొస్తాయి!
నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మనిషి జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం . అనారోగ్యం పాలవని వారు ఎవ్వరూ ఉండరు. అయితే ఆ రుగ్మతలకు కూడా మీరు జన్మించిన రాశులు, వాటికి అధిపతులైన గ్రహాలు కారణం అవుతాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి మీ రాశిని బట్టి మీకొచ్చే రుగ్మతలేంటో తెలుసుకోండి..
మేష రాశి
మేష రాశి అగ్నితత్వానికి సంబంధించిన రాశి. ఈ రాశివారికి శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
వృషభ రాశి
వృషభ రాశి భూ తత్వానికి సంబంధించిన రాశి. ఈ రాశివారికి గొంతు, మెడ, నరాలు,ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా వస్తాయి.
Also Read: మేష రాశిలో మూడు గ్రహాల కలయిన, ఈ మూడు రాశులవారికి కష్టాలే!
మిథున రాశి
మిథున రాశి వాయుతత్వానికి సంబంధించినది. ఈ రాశులకు చెందినవారికి భుజాలు, చేతులు, ఎముకలు, నరాలు, శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది
కర్కాటక రాశి
కర్కాటక రాశి జలతత్వనికి సంబంధించినది. ఈ రాశి వారికి రొమ్ము ,జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులొచ్చే అవకాశం ఉంది
సింహ రాశి
సింహ రాశి అగ్నితత్వానికి సంబంధించిన రాశి. ఈ రాశివారికి ఎక్కువగా గుండె, వెన్నుముకకు సంబంధించిన రుగ్మతలు వస్తాయి.
కన్యా రాశి
కన్యా రాశి భూ తత్వానికి సంబంధించిన రాశి. ఈ రాశివారికి ఎక్కువగా ఉదరకోశం,పొత్తికడుపు సంబంధిత వ్యాధులొస్తాయి
తులా రాశి
తులా రాశి వాయు తత్వానికి సంబంధించినది. ఈ రాశివారికి కటి భాగం, నాభి, మూత్రపిండాలకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జల తత్వానికి సంబంధించిన రాశి. ఈ రాశివారికి జననేంద్రియాలు, మూత్రకోశం సంబంధిత వ్యాధులొస్తాయి
ధనుస్సు రాశి
ధనస్సు రాశి అగ్నితత్వానికి సంబంధించినది. ఈ రాశివారికి తొడలు, పిరుదులు, రక్త నాళాలకు సంబంధించిన రుగ్మతలు వస్తాయి
మకర రాశి
మకర రాశి భూ తత్వానికి సంబంధించినది...ఈ రాశివారికి మోకాళ్లు, కీళ్లకు సంబంధించిన సమస్యలుంటాయి
Also Read: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు
కుంభ రాశి
వాయు తత్వానికి సంబంధించిన కుంభ రాశివారికి కాళ్లు, పిక్కలు, రక్తప్రసరణకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి
జల తత్వం ఉన్న మీనరాశివారికి పాదాలు, వేళ్లు, రక్తానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
రాశులతో పాటూ మీ గ్రహసంచారం సరిగా లేకపోవడం వల్ల కూడా కొన్ని వ్యాధుల బారిన పడతారు.
సూర్యుడు : హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను ,మహిళలకు ఎడమకన్ను
చంద్రుడు: ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు
బుధుడు : జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ వంటి మానసిక వ్యాధులు
శుక్రుడు : జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు.
కుజుడు: నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.
గురువు : కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.
శని: దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు
లగ్న రాశి నుంచి గాని , సూర్య రాశి నుంచి గాని ,చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు , ఆ రాశి అధిపతులు ,ఆ రాశిలో ఉన్నా గ్రహాలూ ,కారకత్వాలను తెలుసు కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది.