News
News
వీడియోలు ఆటలు
X

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

Weekly Rasi Phalalu ( April 03 to 09) : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope ( April 03 to 09):  ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభ ఫలితాలున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

మేష రాశి 

ఈ వారం మేష రాశి వారికి సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. వారం ప్రారంభం నుంచి మీరు తలపెట్టిన పనిలో ఆశించిన విజయం అందుకుంటారు. ఉద్యోగులు తమ సీనియర్లు, జూనియర్లతో మంచి ర్యాపో మెంటైన్ చేస్తారు. వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ముఖ్యమైనవి..ఇవి ప్రస్తుతానికి మాత్రమే కాదు..భవిష్యత్ లో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి పెద్ద పదవి లేదా బాధ్యత లభిస్తుంది. పరీక్ష-పోటీలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఆశించిన విజయం లభించే అవకాశం ఉంది.  ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధించండి. 

కర్కాటక రాశి

ఈ వారం కర్కాటక రాశి వారికి శుభఫలితాలున్నాయి. ఈ వారం వృత్తి- ఉద్యోగం-వ్యాపారాలలో ఆశించిన పురోగతిని చూస్తారు. మీరు చాలా కాలంగా మీ వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తుంటే ఈ వారం మీ ప్లాన్ నిజమయ్యేలా కనిపిస్తోంది. ప్రభుత్వం-పరిపాలనతో సంబంధం ఉన్న సమర్థవంతమైన వ్యక్తి సహాయంతో మీకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం లభిస్తుంది. వీరికి అదనపు ఆదాయ మార్గాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  వారం ద్వితీయార్థంలో పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు.   ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ వారం ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది.  అవివాహితులకు సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. నిత్యం దుర్గాచాలీశా పఠించండి..

Also Read:  ఈ 5 కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు

సింహ రాశి

ఈ రాశివారికి ఈ వారం చాలా బావుంది. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న అదృష్టం ఈ వారం మీకు తోడుగా రానుంది. కోరుకున్న చోటుకి బదిలీ కావాలన్న  ఉద్యోగుల కోరిక నెరవేరుతుంది. పని ప్రదేశంలో మీ స్థాయి , స్థానం రెండూ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులైన మహిళలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వారి జీవితానికి సంబంధించిన పురోగతి పనిప్రాంతంలోనే కాకుండా కుటుంబంలో కూడా గౌరవాన్ని పెంచుతుంది. భూమి, భవనానికి సంబంధించిన వివాదాలను సీనియర్ వ్యక్తుల సహాయంతో పరిష్కరిస్తారు. పూర్వీకుల ఆస్తిని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ వృత్తి లేదా వ్యాపారాన్ని విదేశాలలో చేయడానికి ప్రయత్నిస్తుంటే ఈ వారం చివరి నాటికి శుభవార్తలు అందుతాయి. మీ ప్రేమ భాగస్వామితో ఏదైనా విషయంలో వివాదం ఏర్పడితే..స్నేహితుల సహాయంలో అపార్థం తొలగిపోతుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నిత్యం లక్ష్మీ నారాయణుడిని ఆరాధించండి.

ధనుస్సు రాశి

ధనస్సు రాశివారికి ఈ వారం వృత్తి, వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు కుటుంబానికి, పరస్పర సంబంధాలకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వారం ప్రారంభంలో తోబుట్టువులతో ఏదో విషయంపై చర్చ జరగుతుంది.  కుటుంబంలో పెద్దల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం వల్ల మీ మనస్సు విచారంగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు.. వారం ద్వితీయార్థంలో అపార్థాలు క్లియర్ అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు వారం మధ్యలో ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. మీ స్నేహం ప్రేమ సంబంధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఓ రిలేషన్లో ఉన్నట్టైతే ఆ బంధం బలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. ఆరోగ్యం , ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!

మకర రాశి 

మకర రాశివారికి  ఈ వారం ప్రారంభం నుంచి అనుకున్నపనులు పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు వృత్తి లేదా వ్యాపారం కోసం ఏ ప్రణాళిక వేసినా విజయవంతమవుతుంది - ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగుల నిరీక్షణ  ఈ వారం ఫలిస్తుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మార్కెట్లో బూమ్ ను సద్వినియోగం చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళిక ఫలప్రదంగా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ తో సంబంధం ఉన్నవారికి చాలా ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. డబ్బును పెట్టుబడిగా పెట్టేముందు నిపుణుడు లేదా మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతి లభిస్తుంది. ప్రేమ జీవితం పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నిత్యం సుందరకాండ పఠించండి మీకు మంచి జరుగుతుంది. 

కుంభ రాశి

ఈ రాశివారికి గడిచిన వారంకన్నా బావుంటుంది. ఈ వారం మీరు మీ సమయాన్ని, శక్తిని పూర్తిగా వినియోగిస్తే ఊహించినదానికన్నా ఎక్కువ ఫలితాలు పొందుతారు. వారం ప్రారంభంలో సమర్థవంతమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. దీని కారణంగా భవిష్యత్ లో లాభపడతారు. ఈ సమయంలో వృత్తి-వ్యాపారాల దిశగా చేసే ప్రయత్నం విజయవంతమవుతుంది. పనిప్రాంతంలో సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరూ మీ పట్ల దయ చూపుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులను వెతుక్కుంటారు. పనిచేసే మహిళలు పురోభివృద్ధి సాధిస్తారు...ఇంట్లో మీ గౌరవం పెరుగుతుంది. వారం చివరిలో రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పెద్ద కోరిక నెరవేరుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. నిత్యం రుద్రాష్టకం పఠిస్తే మీకు శుభం జరుగుతుంది. 

Published at : 02 Apr 2023 06:15 AM (IST) Tags: aries weekly horoscope astrology predictions in telugu weekly predictions zodiac signs in telugu Every Zodiac Sign's Weekly horoscope Weekly Horoscope 02 April to 09 April 03 April to 09 april rashifalalu

సంబంధిత కథనాలు

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్