News
News
X

2023 మార్చినెల రాశిఫలాలు, అపనిందలు, ఆకస్మిక ప్రమాదాలు - మార్చిలో ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!

March Rasi Phalalu 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

March Horoscope 2023:  మార్చి నెలలో ఈ ఆరు రాశులవారికి  ఆర్థిక ఇబ్బందులు, తలపెట్టిన పనుల్లో ఆంటకాలు తప్పవు. మనోధైర్యం కోల్పోకుండా ఉంటే కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.

వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈ రాశివారికి మార్చి నెలలో  కుటుంబంలో సోదరులతో విభేదాలు వస్తాయి.. ఆకస్మిక ప్రమాదాలు జరుగుతాయి అప్రమత్తంగా ఉండాలి. శుభకార్యానికి హాజరవుతారు. రావాల్సిన మొత్తం చేతికందుతుంది..ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కోపం తగ్గించుకోపోవడం వల్ల కొన్ని కార్యాలు అర్థాంతరంగా ఆగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం చేస్తారు. నెల చివర్లో శుక్రసంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంగా ఉండాసి

మిథున రాశి (మృగశిర 3,4 పాదాసు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ నెలలో గ్రహసంచారం మిశ్రమంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకుండా తమపని తాముచేసుకోవడం మంచిది. మీలో ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

కర్కాటక రాశి (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశివారికి మార్చి నెల ప్రధమార్థం కన్నా ద్వితీయార్థం బావుంటుంది. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి.  అన్నదమ్ముల మధ్య సఖ్యత సరిగా ఉండదు. అధికారులు, శత్రుల వలన ఇబ్బందులు పడతారు. అపనిందలు తప్పవు.  ఆర్థిక సమస్యలుంటాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. నెల చివర్లో పరిస్థితులు మీకు కలిసొస్తాయి. దైవసంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబానికి సమయం కేటాయించండి. ఉద్యోగులు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేందుకు ప్రయత్నించండి.

సింహ రాశి  (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదాలు)

సింహరాశివారికి ఈ నెల పరిస్థితులు అంత అనకూలంగా లేవు. నమ్మినవారివల్ల మోసపోతారు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. అతి కష్టం మీద పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి తగాదాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి

Also Read: వార ఫలాలు, మార్చి మొదటి వారం ఈ రాశివారు తమ ఇష్టానికి విరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తుంది!

కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఈ నెలలో గ్రహసంచారం అనుకూలంగా లేకపోవడంతో అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదురువుతాయి. వృత్తి,వ్యాపారాల్లో అనుకూలత ఉండదు. అనారోగ్య సమస్యలుంటాయి. ధైర్యం కోల్పోతారు. అనవసరంగా మాటలుపడతారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. అకాల భోజనం చేస్తారు. సంఘంలో గౌరవం తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవ్వరితోనూ వానదపెట్టుకోవద్దు.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి చాలా ముఖ్యమైనది అవుతుంది

మీన రాశి  (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మీన రాశివారికి మార్చి నెల పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆపదలు సంభవించే ప్రమాదం ఉంది. నమ్మినవారివలన మోసపోతారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో అడుగు ముందుకు పడదు...నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు.  పిల్లల్లో పట్టుదల తగ్గుతుంది. ఆకస్మిక కలహాలు ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తప్పవు

Published at : 28 Feb 2023 06:29 AM (IST) Tags: 12 zodiac signs March Horoscope 2023 in telugu Your March Horoscope Is Here Virgo Horoscope March 2023 March Monthly Horoscope

సంబంధిత కథనాలు

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!

Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!

Political Horoscope: 2023-2024 ఈ రాశులకు చెందిన రాజకీయనాయకులకు గడ్డుకాలమే!

Political Horoscope:  2023-2024 ఈ రాశులకు చెందిన రాజకీయనాయకులకు గడ్డుకాలమే!

ఏప్రిల్ 1 రాశిఫలాలు, అన్ని విషయాల్లో ఈ రాశివారి డామినేషన్ పెరుగుతుంది

ఏప్రిల్ 1 రాశిఫలాలు, అన్ని విషయాల్లో ఈ రాశివారి డామినేషన్ పెరుగుతుంది

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!