By: RAMA | Updated at : 26 Feb 2023 06:35 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Weekly Horoscope 27 February to 5 March 2023: వారఫలాలు 27 ఫిబ్రవరి నుంచి మార్చి 5 వరకు సాగే ఈ వారంలో ఈ రాశులవారికి కొన్ని సవాళ్లు తప్పవు. ఓపికగా వ్యవహరిస్తే మాత్రమే అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి...ఆ రాశులేంటో చూద్దాం
ఈ రాశి వారు మనసులోని ఇష్టాలకు విరుద్ధంగా ఆఫీసులో ఒకరి కోసం బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. ఎలాంటి ప్రతిస్పందనలు లేకుండా ప్రశాంతంగా పని చేస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారం పనిపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యువకులు సోమరితనాన్ని వీడి ఈ వారం కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామికి సహకారంగా ఉండాలి. చర్మ సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
ఈ రాశివారు తమ తప్పులను సరిదిద్దుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తుంటే వారి మాటలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరిదిద్దుకోవాలి. విదేశీ ఉత్పత్తుల వ్యాపారంలో పనిచేసే ఉద్యోగులు ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. ఈ వారం ఈ రాశివారి యువత మనస్సులో తరచూ ప్రతికూల ఆలోచనలు ఉంటే..మరికొంతమంది యువత ఆలోచనలన్నీ దైవారాధన చుట్టూ తిరుగుతాయి. ఈ వారం పనికి సంబంధించి కుటుంబంలో చురుకుగా ఉండాలి. వారం మధ్యలో అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. బయట ఆహారం తీసుకోకుండా ఉండడం ఉత్తమం.
Also Read: ఈ 5 కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు
కన్యారాశి వారు తమపని తాముచేసుకోవడం మంచిది. ఈ వారం ఇతరులపై అస్సలు ఆధరపడొద్దు. వృత్తిపరమైన లాభాల కోసం అధికంగా ఆరాటపడొద్దు..ఆరోగ్యం జాగ్రత్త. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ వారం గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కోపాన్ని తగ్గించుకోకుంటే నష్టపోతారు. జీవితభాగస్వామి పట్ల మీ పూర్తి బాధ్యతను నెరవేర్చడం ద్వారా వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..లేదంట అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.కోవాలి.
మకర రాశి వారికి ఈ వారం బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో ముఖ్యమైన పనుల బాధ్యత మీపై ఉంటుంది. ఈ వారం వ్యాపారంలో సవాళ్లు ఎదురవుతాయి.అయితే ఆందోళన చెందకండి.ఓపికహా వ్యవహరిస్తే సవాళ్లను సులభంగా అధిగమిస్తారు. మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. యువకులు తమను తాము నవీకరించుకోవడానికి, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇధే సరైన సమయం. మీ తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం మీకు లభిస్తే, ఓపెన్ మైండ్ తో చేయండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త
మీకు ఒక పెద్ద ప్రాజెక్టును అప్పగిస్తే దాని గురించి టెన్షన్ పడొద్దు, ఆత్మవిశ్వాసం తగ్గించుకోవద్దు..అంతా బాగానే ఉంటుంది. వ్యాపారం,ఉద్యోగం విషయంలో అతిగా ఆలోచించి అనర్థాలు తెచ్చుకోవద్దు. అందరితో కలసి పనిచేయడం అలవాటు చేసుకోండి. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది..వారి సంరక్షణకోసం సమయం కేటాయించండి. ఇదే సమయంలో మీ ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ఈ వారం ఈ రాశివారు ఏదైనా శిక్షణలో పాల్గొంటుంటే జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. హోల్ సేల్ వ్యాపారులు పెద్ద పెద్ద బాధ్యతలు తలకెత్తుకోవద్దు. ఈ వారం కొన్ని సమస్యలు ఎదుర్కోకతప్పదు. యువకులు తమను తాము ప్రమోట్ చేసుకోవాలి.. చేసిన పనిని అవసరం అయినప్పుడు చెప్పుకోవడం రావాలి. కుటుంబంలో అందరికీ గౌరవం ఇవ్వండి. కోపం తగ్గించుకోవాలి, ప్రేమగా స్పందించాలి. వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వారంతానికి అంతా బావుంటుంది.
Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు
Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!
Sri Sobhakritu Nama Samvatsaram: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం
Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!
మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!