News
News
వీడియోలు ఆటలు
X

Love Horoscope Today 6th May 2023: ఈ రాశివారు ప్రేమను మనసులో ఫీలవొద్దు బయటకు చెప్పే ప్రయత్నం చేయండి!

Love Horoscope Today 6th May 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Love Horoscope Today 6th May 2023

మేష రాశి

ఈ రోజు ఈ రాశివారు నూతన ఉత్సాహంతో ఉంటారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం. వైవాహిక జీవితంలో ఉన్నవారు అహంకారం తగ్గించుకోవాలి..లేదంటే జీవిత భాగస్వామితో వివాదం జరిగే అవకాశం ఉంది. ప్రయాణానికి  ప్రణాళికలు రూపొందించుకోవచ్చు.

వృషభ రాశి

ఈ రాశివారి ప్రేమ జీవితం, వైవాహిక జీవితం మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమికులకు కలిసొచ్చే సమయం. కుటుంబ సభ్యుల నుంచి మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.

మిథున రాశి

ఈ రాశివారి ప్రేమికులకు, వైవాహిక జీవితంలో ఉన్నవారికి మీ భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఎప్పటి నుంచో చెప్పకుండా మనసులోనే దాచుకున్న విషయాలను బయటకు చెప్పడం ఉత్తమం. స్నేహితులతో  విభేదాలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త.

Also Read:  మరణ సమయంలో ఈ 4 వస్తువులు ఉంటే స్వర్గం ఖాయం..!

కర్కాటక రాశి 

ఈ రాశివారి జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికులకు బహుమతి ఇస్తారు..నిన్నటి వరకూ మీపై ఉన్న కోపం వారికి తొలగిపోతుంది. కుటుంబానికి సమయం కేటాయించాలి. 

సింహ రాశి

ఈ రాశివారు ప్రేమ సంబంధాలలో నమ్మకాన్ని ఇవ్వండి..ఆ నమ్మకం లేకపోతే బంధం వీడిపోవచ్చు.ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ మనస్సులో స్నేహితుడి పట్ల ప్రేమ తలెత్తుతుంది. అవివాహితులకు సంబంధం కుదురుతుంది

కన్యా రాశి

ఈ రాశివారు బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు...అది వివాహ బంధమైనా, ప్రేమ బంధమైనా గౌరవంగా మసలుకుంటారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి.

తులా రాశి

ఈ రాశివారి జీవితంలో సంఘర్షణ తలెత్తవచ్చు..కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీరు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తే కచ్చితంగా మంచి జరుగుతుంది. మీ బాధ్యతల నుంచి పారిపోవద్దు

Also Read: భార్య వ్యవహారాలు భర్తే చూసుకోవాలి.!

వృశ్చిక రాశి 

ఈ రాశివారికి మనసులో ప్రేమను దాచుకోవడం కాదు..బయటకు చెప్పగలగాలి. సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడకపోతే ఆ బంధం బలహీనపడుతుందని గుర్తుంచుకోవాలి. ఓర్పు, సహనం చాలా అవసరం

ధనుస్సు రాశి 

ఈ రాశివారి జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైనవారితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. అనవసర కోపం తగ్గించుకోవడం మంచిది

మకర రాశి

ఈ రాశివారు జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మాటలను నియంత్రణలో ఉంచుకోండి. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ప్రతి సమస్యనూ ఓర్పుతో పరిష్కరించుకోండి. 

కుంభ రాశి

ఈ రాశివారి ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ జీవితంలో కొత్తదనం ఉంటుంది. మీ మనసులో మాటను ఇప్పటివరకూ చెప్పి ఉండకపోతే ఇక ఆలస్యం చేయవద్దు. సమస్యలు ఎదురవుతాయి కానీ వాటిని మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు

మీన రాశి 

ఈ రాశివారి ప్రేమ జీవితం,వైవాహిక జీవితం నార్మల్ గా ఉంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడిపే అవకాసం వస్తుంది. మీ వ్యక్తిగత వ్యవహారాల ప్రభావం మీ పనిపై పడకుండా చూసుకోవడం చాలా అవసరం.

Published at : 06 May 2023 06:25 AM (IST) Tags: Love and Relationship Horoscope 6th May 6 2023 Love Horoscope Aaj Ka Love Rashifal 6th may Love Horoscope Today

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్