Love Horoscope Today 5th January 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామికి, ప్రేమించిన వారికి వీర విధేయులు
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 5th January 2023 : ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
మీ సోల్ మేట్ ని కలిసేందుకు ఈ రోజు అనుకూలమైన రోజు. ఓ బంధాన్ని కలుపుకునేముందు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి...దూకుడుగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ లో బాధలు తప్పవు. వివాహితులు భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించండి.
వృషభ రాశి
తోబుట్టువుల సమస్యలు ప్రస్తుతం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. కొంచెం కొత్తగా ఆలోచిస్తే ఆనందం మీ సొంతం. విభేదాలను నివారించడానికి మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. ఏదైనా చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారికి ప్రేమకు, స్నేహానికి ఉత్తమమైన రోజు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి, మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమను వ్యక్తీకరించడానికి ఇదే మంచి సమయం. మీ మనసులో మాటని మాధ్యమాల ద్వారా కాకుండా నేరుగా చెప్పేందుకు ప్రయత్నించండి.
కర్కాటక రాశి
ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ప్రేమికులకు మంచి రోజు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. భాగస్వామి అలక తీర్చేందుకు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారు.
సింహ రాశి
మనసులో ఉన్న మాటను ఎదుటివారు తెలుసుకుంటారులే అనే భ్రమలో ఉండిపోవద్దు..మీరు వ్యక్తం చేస్తేనే వారికి అర్థం అవుతుందని ముందు మీరు అర్థం చేసుకోండి. మీ కారణంగా మీ ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు.వివాహితులు సంతోషంగా ఉంటారు.
Also Read: ఈ రాశివారు మాట్లాడుతూనే ఉంటారు కానీ అస్సలు వినరు, జనవరి 5 రాశిఫలాలు
కన్యా రాశి
వివాహ ప్రణాళికకు ఇదే సరైన సమయం. మానసిక సమస్యలను నియంత్రించాలంటే మిమ్మల్ని మీరు మరింత బిజీగా మార్చుకోండి. జీవిత భాగస్వామి, ప్రేమ భాగస్వామి తో స్పెండ్ చేసేందుకు సమయం సరిపోదు.
తులా రాశి
ఈ రోజు మీరు ఇతరుల నుంచి మీరుసహాయం పొందుతారు. మీ స్నేహితులలో ఒకరిని మీరు ప్రత్యేకంగా భావిస్తారు. ఇన్నాళ్లుగా కనిపించనంత ప్రత్యేకంగా వారు కనిపిస్తారు. వివాహితులు తమ మధ్య దూరం తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి
వృశ్చిక రాశి
ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్లాన్ చేసిన ఎలాంటి ప్రణాలిక అయినా సక్సెస్ అవుతుంది. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. మీ మనసుకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఈరోజు మీకు ఓ శుభవార్త చెబుతారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు.ప్రేమ భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారి నిరీక్షణ ఫలిస్తుంది. మీరు ఇప్పటికే సంబంధానికి కట్టుబడి ఉన్నట్లయితే..వారితో ఆనందకరమైన సమయం గడుపుతారు
Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు
మకర రాశి
ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. కొత్తగా ఓ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఈ రోజు మీరు ఊహించినదానికన్నా సంతోషంగా ఉంటారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగులేస్తారు. మీకు తెలియని వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రవర్తననే మీ పిల్లలు ఫాలో అవుతారు..అందుకే జాగ్రత్తగా మసలుకోండి.
కుంభ రాశి
మానసికంగా ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. భార్య లేదా ప్రేమికులకు మీరు విధేయులుగా ఉంటారు. ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు.
మీన రాశి
ఈ రోజు మీకు కలిసొస్తుంది. ముగిసిపోయాయి అనుకున్న బంధాలను మళ్లీ పునరుద్ధరిస్తారు.కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. విచ్ఛిన్నమైన వివాహ, ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. పరస్పర అవగాహన ప్రేమను బలపరుస్తుంది.