జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి



జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రంగులు మానవ జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీనిని విశ్వశిస్తారు



మీరు వేసుకునే దుస్తుల రంగు కూడా మీ జయాపజయాల్లో కొంతవరకూ భాగం అవుతుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్రం పండితులు



ఆదివారం
సూర్యుడికి అంకితం చేసిన ఆదివారం రోజు పసుపు, లేత కుంకుమ, గులాబీ లేదా లేత ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ రోజు ముదురు కుంకుమపువ్వు రంగు చొక్కా ధరించరాదు



సోమవారం
ఇది చంద్రుడి రోజు..ఈ రోజున తెలుపు, లేత నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది



మంగళవారం
మంగళవారాన్ని అంగారక గ్రహం కింద పరిగణిస్తారు. ఈ రోజు ఎరుపు, కుంకుమ రంగు దుస్తులు ధరించాలి



బుధవారం
బుధుడు తెలివితేటలు, వాక్చాతుర్యం, చదువులు, వ్యాపారానికి కారకుడు. ఈ రోజు ఆకుపచ్చ దుస్తులు వేసుకోవాలి



గురువారం
ఇది బృహస్పతి కి సంబంధించిన రోజు..ఈ రోజు పసుపు రంగు చొక్కా ధరించడం గురువు ఆశీర్వాదం లభిస్తుందని చెబుతారు



శుక్రవారం
శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ఈ రోజున గులాబీ, క్రీమ్ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి



శనివారం
శనివారం శనికి సంబంధించిన రోజు. శని నుంచి శుభ ప్రభావాలను పొందడానికి నలుపు లేదా నీలం చొక్కా ధరించడం
మంచిది