By: RAMA | Updated at : 05 Jan 2023 05:41 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 5th January 2023 (Image Credit: freepik)
5th January 2023 Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మేషరాశివారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే మంచిరోజు. ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసొస్తాయి. ఆర్థిక పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచాలి.
వృషభ రాశి
కొన్ని పనులు నెరవేర్చుకునేందుకు వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించుకుంటారు. ఈ విషయంలో జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉంటారు. ఈ రోజు గడిస్తే చాలనే ఆలోచన నుంచి బయటపడండి..రేపటి గురించి ఆలోచించాలి. మీ సంతోషం కోసం అవసరమైన దానికన్నా ఎక్కువ సమయం, డబ్బు ఖర్చు చేస్తారు..ఈ విషయంలో మార్పు రావాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
మిథున రాశి
ఈ రోజు మిథున రాశివారు ఆర్థిక లాభాలు పొందుతారు. నిన్నటి వరకూ మీ నియంత్రణలో లేని విషయాలు ఇప్పుడు మీ కంట్రోల్ లోకి వస్తాయి. డబ్బు విషయాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధపెట్టాలి. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు
Also Read: ఈ సంక్రాంతికి ఈ ఐదుపనులు చేసేలా ప్లాన్ చేసుకోండి!
కర్కాటక రాశి
ఈరోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. జీవిత భాగస్వామితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులకు సాధారణంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేయడంలో ఆటంకం ఏర్పడుతుంది.
సింహ రాశి
ఈరోజు సింహరాశివారికి ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగులకు శుభసమయం. మీ కుటుంబ సభ్యుల కారణంగా మీ వైవాహిక జీవితంపై ప్రభావం పడుతుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. వివాదాల్లో తలదూర్చకండి.
కన్యా రాశి
ఒత్తిడి నుంచి మీరు ఉపశమనం పొందుతారు. ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. మీరు మాట్లాడటమే కాదు ఎదుటివారి అభిప్రాయాలు వినడం, వాటిని పరిగణలోకి తీసుకుని వ్యవహరించడం చాలా ముఖ్యం అని గుర్తించండి. వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది.
తులా రాశి
ఈ రోజు మీకు సాధారణ ఫలితాలున్నాయి. వ్యాపార రంగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. సోమరితనం కారణంగా, మీ ముఖ్యమైన పనులు కొన్ని తప్పిపోవచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
వృశ్చిక రాశి
పాత పెట్టుబడుల వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కొన్ని వార్తల కోసం ఎదురు చూస్తున్నట్లయితే..వాటిని ఈ రోజు వింటారు. మీ జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీపై చాలా ఒత్తిడి పడుతుంది.
Also Read: భోగి మంటలకు అన్నీ రెడీ చేసుకుంటున్నారా, ఇవి మాత్రం వేయకండి!
ధనుస్సు రాశి
ఒత్తిడిని నివారించడానికి పిల్లలతో మీ విలువైన సమయాన్ని వెచ్చిస్తారు. ప్రయాణాల వల్ల మీరు చాలా అలసిపోతారు కానీ ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం కారణంగా మీరు డిప్రెషన్‌కు లోనవుతారు. కళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పవని గుర్తుంచుకోండి.
మకర రాశి
ఈ రోజు మీకు బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. వ్యాపారులకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఓర్పుతో చేసే పనిలో విజయం సాధిస్తారు. స్నేహితుల సహకారంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కుంభ రాశి
అవివాహితులకు సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మీ స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం..లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొందరితో వాదనలు జరిగే అవకాశం ఉంది.
మీన రాశి
ఈ రోజు మీకు గొప్ప రోజు. మీరు కార్యాలయంలో అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందవచ్చు. వృత్తిపరమైన పురోగతికి ఈరోజు అనుకూలమైన రోజు. కొంతమంది మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. మీరు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపవచ్చు.
Magha Pournami 2023: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏంటి - ఆ రోజు సముద్రం స్నానం ఎందుకు చేయాలి!
Love Horoscope Today 31st January 2023: పాతస్నేహం వల్ల ఈ రాశివారి జీవితంపై ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్త
Horoscope Today 31st January 2023: ఈ రాశివారు సవాళ్లను కూడా అనుకూలంగా మలుచుకుంటారు, జనవరి 31 రాశిఫలాలు
Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు
Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి