అన్వేషించండి

Makar Sankranti 2023: ఈ సంక్రాంతికి ఈ ఐదుపనులు చేసేలా ప్లాన్ చేసుకోండి!

హిందువులకు మకర సంక్రాంతి చాలా ప్రత్యేకం. దేశవ్యాప్తంగా సందడి ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి ఉంటుంది. సూర్యుడు దిశను మార్చుకునే ఈ పవిత్రమైన రోజున కొత్తగా ఉండాలంటే కొంచెం కొత్తగా ఆలోచించాలి మరి

 Makar Sankranti 2023: భోగి మంటలు, రంగు ముగ్గులు, గొబ్బిళ్లు, పిండివంటలు, కోడి పందాలు, పతంగులు, కొత్త అల్లుళ్లు, ఇల్లంతా బంధువులు... ఒకటా రెండా..సంక్రాంతి గురించి చెప్పుకుంటూ పోతే చేంతాడంత జాబితా ఉంది. అయితే అంతా కలసి ఆనందంగా గడిపే క్షణాలను మరింత ఆనందంగా మార్చుకునేందుకు చిన్న చిన్న పనులు చేయమంటున్నారు పండితులు. 

నదీస్నానం ఉత్తమం
మకర సంక్రాంతి రోజున గలగలపారే నీటిలో స్నానం చేయడం చాలామంచిదంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఈరోజు గంగా నదిలో కానీ, తమకు సమీపంలో ఉన్న నదిలో కానీ స్నానం చేస్తారు. ఈ అవకాశం లేనివారు... గతంలో నదీస్నానానికి వెళ్లినప్పుడు బాటిల్స్ లో తీసుకొచ్చిన నీటిని ట్యాంక్ లో మిక్స్ చేసి చేసినా కొంత ఫలితం ఉంటుంది.

Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

సూర్యుడికి నమస్కారం చేయండి
ఉరకల పరుగల జీవితంలో ఎప్పుడు నిద్రపోతున్నామో, ఎప్పుడు లేస్తున్నామో  పట్టించుకోవడం లేదు. కొందరైతే సూర్యోదయం కూడా చూడరు...ఏ అర్థరాత్రికో వచ్చి నిద్రపోయి పొద్దెక్కాక లేచి ఆఫీసులకు వెళ్లిపోతున్నారు. సంక్రాంతి అనేసరికి సాధారణంగా ఆ మూడు రోజు ఏ పనులు పెట్టుకోరు..కార్యాలయాలకు దూరంగా సొంతూర్లతో సంతోషంగా గడుపుతారు. అందుకే ఆ మూడు రోజులైనా తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి..సూర్యుడికి అర్ఘ్యం( దోసిలితో నీరు) అర్పించండి.  మకర రాశిలోకి ప్రవేశించిన సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఇప్పటి వరకూ జీవితంలో ముసురుకున్న చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతాయని విశ్వాసం. 

మీ శక్తి మేరకు దానం చేయండి
పండుగ అంటేనే అంతా సంతోషంగా ఉండడం. అందుకే ఈ రోజున పేదలకు అన్నదానం చేయండి. వస్త్రదానం మరీ మంచిది. ఇంటింటా సందడి చేసే డూడూ బసవన్నకి ఆహారం అందించండి. మీకు సమీపంలో ఉన్న పశువుల పాకకు,గోశాలలకు వెళ్లి వాటికి ఆహారం అందించి నమస్కరించి రండి. ముఖ్యంగా ఈ రోజు నల్లనువ్వులు దానం చేయడం చాలా మంచిదంటారు. 

పిండి వంటలు పంచుకోండి
సంక్రాంతికి దాదాపు పది రోజుల ముందు నుంచీ పిండివంటలు ఘుమఘుమలాడిపోతుంటాయి. ఏ ఇంట చూసినా  పిండి వంటలు తయారీనే. కొందరు పండుగ రోజు నువ్వులు తినడం ఏంటనే సెంటిమెంట్ తో ఉంటారు కానీ చాలా ప్రాంతాల్లో నువ్వులతో చేసిన వంటలను సంక్రాంతికి ఆస్వాదిస్తారు. లడ్డు, ఖిచ్డి తయారు చేసి పంపిణీ చేస్తారు. ఇన్ని చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం అని చెప్పుకోవడం కాదు..సరదాగా చుట్టుపక్కల వారితో మీరు చేసిన వంటకాలు పంచుకోండి. 

Also Read: Also Read: శని బాధలు తొలగిపోవాలంటే సంక్రాంతికి ఇలా చేయండి

ఆకలితో ఉన్నవారు కనిపించకూడదు
పండుగ రోజుల్లో మధ్యాహ్నం భోజనం తర్వాత భుక్తాయాసం తీర్చుకునేందుకు మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అలా చుట్టేసి రండి.  ఎక్కడైనా ఎవరైనా ఆకలితో ఉంటే ఆ రోజు వారికి మీకు తోచిన సాయం చేయండి. దేవుడు ఎక్కడో ఉండడు..మనం చేసే సాయం లోనూ, ఆకలితో ఉండేవారికి పెట్టే అన్నంలోనే ఉంటాడంటారు కదా..అందుకే పండుగ రోజు మనం పది రకాల వంటకాలతో భోజనం చేయడం కాదు.. పస్తులున్న వారికి గుప్పెడు మెతుకులు ఇవ్వడం కన్నా పెద్ద పండుగ ఏముంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: ధనుస్సు, మీనానికి అదృష్టం; మకరం, కుంభానికి కష్టాలు!
నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: ధనుస్సు, మీనానికి అదృష్టం; మకరం, కుంభానికి కష్టాలు!
నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: సింహ, వృశ్చిక రాశులకు శుభం, కన్య, తుల రాశులకు జాగ్రత్త!
నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: సింహ, వృశ్చిక రాశులకు శుభం, కన్య, తుల రాశులకు జాగ్రత్త!
నవంబర్ 8, 2026 రాశిఫలాలు: దీపావళి రోజు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎవరికి అదృష్టం? ఎవరికి కష్టం?
నవంబర్ 8, 2026 రాశిఫలాలు: దీపావళి రోజు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎవరికి అదృష్టం? ఎవరికి కష్టం?
నవంబర్ 8-14 వారఫలం: కుంభ, మీన రాశులకు ధనయోగం, ప్రేమలో విజయం!
నవంబర్ 8-14 వారఫలం: కుంభ, మీన రాశులకు ధనయోగం, ప్రేమలో విజయం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget