Makar Sankranti 2023 Wishes In Telugu: మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
Makar Sankranti 2023 : ఊరూ వాడా సంక్రాంతి సందడి మొదలైంది. ఇంకెందుకు ఆలస్యం..మీ కొటేషన్స్ తో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేయండి..
![Makar Sankranti 2023 Wishes In Telugu: మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి Makar Sankranti 2023 Wishes In Telugu: Sankranthi Quotes, Telugu Greetings and Happy Makar Sankranti 2023 Wishes Makar Sankranti 2023 Wishes In Telugu: మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/b730f31ec7b25cc3e36f859c83871c5b1673604564728217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Makar Sankranti 2023 Wishes In Telugu: సంక్రాంతి అంటే నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. సంక్రాంతి, పొంగల్, మాఘి పేరేదైనా పండుగ ఒకటే. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో హిందువులు, సిక్కులు ప్రముఖంగా జరుపుకునే పండగ ఇది. ఆంధ్రులకు సంక్రాంతి అతిపెద్ద పండుగ అయితే తెలంగాణలో రెండో అతిపెద్ద పండుగ. ఈ వేడుకల్లో మీతో పాటు మీ ఆత్మీయులను భాగస్వామ్యం చేసేలా, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు మరియు మీ ప్రియమైన వారందరికి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త కాంతిని నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
Also Read: శని బాధలు తొలగిపోవాలంటే సంక్రాంతికి ఇలా చేయండి
ఈ సంక్రాంతికి మీ జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
పాలలోని తెల్లదనం, చెరుకులోని తియ్యదనం, ముగ్గులోని రంగుల అందం
అన్నింటి కలయికతో పండగ నాడు కలిపి మీ ఇంట్లో వెల్లివిరియాలి ఆనందం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
ఆ గాలిపటంలా ఉన్నతంగా ఎగిరే మన ఘనత
జీవితాన్ని రంగులమయం చేసే అచ్చమైన వేడుక మన సంక్రాతి
మీకు , మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు
పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తే అందమైన వేడుక
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
ఆకుపచ్చని మామిడి తోరణాలు
పసుపు పచ్చని మేలిమి సింగారంతో మెరిసే గడపలు
ముంగిట్లో ముగ్గులు, అందమైన గొబ్బెమ్మలు
ఇంటికి తరలివచ్చే ధాన్యరాశులు
సంక్రాంతి శుభాకాంక్షలు!
Also Read: సంక్రాంతి ఆద్యంతం సందడి చేసే హరిదాసు, బసవన్న సాక్షాత్తూ ఎవరో తెలుసా!
తరిగిపోని ధాన్యరాశులతో.. తరలివచ్చే సిరిసంపదలతో..
తిరుగులేని అనుబంధాల అల్లికలతో..
మీ జీవితం ఎప్పుడు దినదినాభి వృద్ధి చెందాలని కోరుతూ
సంక్రాంతి శుభాకాంక్షలు!
సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో
ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..
ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు
ఉత్సాహాన్ని పెంచే కోడిపందాలు
ధాన్యపు రాశులతో నిండిపోయే గాదెలు
డూడూ బసవన్నల దీవెనలు
కీర్తనలు పాడే హరిదాసులు..
తనివి తరని వేడుక
మీకు మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
భోగి మీకు భోగభాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖసంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని కోరుకుంటూ…
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ..
మన సంప్రదాయన్ని విశ్వమంతా తెలుపుతూ..
పల్లెటూరి అందాలను ప్రపంచానికి చూపుతూ..
సంక్రాంతి పండుగను జరుపుకోండి..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
కళకళలాడే ముంగిట రంగవల్లలు..
బసవన్నల ఆటపాటలు..
మనకే స్వంతమయిన ఆచారాలు..
మీకు సంతోషాన్ని పంచాలి.. ఈ సంక్రాంతి.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
వణికే చలిలో భోగిమంటలు..
కొత్త బట్టల కోసం ఎన్నో అలకలు..
మదిలో మెదిలో మధుర స్మృతులు..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
జంట సన్నాయి మేళం..
జోడు బసవన్నల తాళం..
మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)