దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగానూ మన్ననలు అందుకున్న కౌటిల్యుడు పరిపాలన గురించి చెప్పిన కొన్ని విషయాలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఆచరణీయమే..
మంచి రాజు లేదా పాలకుడు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయానికి విరుద్ధమైన భావాలున్నవారితో కూడా సంప్రదించాలి.అప్పుడే ఆ విషయం గురించి సమగ్ర స్వరూపం అర్థమవుతుంది.
మంత్రుల సలహాలను వింటున్నప్పుడు రాజు అవి ఎలాంటి సలహాలు అయినా శాంతంగా వినాలి కానీ వారితో తగవుపెట్టుకోరాదు
బలవంతుడైన రాజు బలహీనుడైన రాజుతో యుద్ధం చేయాలి కానీ తనతో సమానమైన వారితో బాహాబాహీకి దిగరాదు.
తనతో వైరం ఉన్న రాజులు ఇద్దరు పొరుగున ఉన్నప్పుడు వారితో వైరం పెంచుకోవడం కన్నా..వారిద్దరి మధ్యా తగవు పెట్టగలగాలి..అప్పుడే తన రాజ్యం సురక్షితంగా ఉంటుంది
వ్యసనాలకు బానిసైన రాజు చేసే ప్రయత్నాలు ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వవు. అపారమైన సైన్యం ఉన్నప్పటికీ వ్యసనాలకు బానిసైన రాజు నాశనం కాక తప్పదు
చాలా కఠినమైన శిక్షలు విధించే రాజును ప్రజలు ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటారు
రాజు ఎప్పుడూ నియంతగా ఉండకూడదు..అందర్నీ కూడగట్టి నిర్ణయం తీసుకోవాలి