ABP Desam


Merry Christmas 2022: ఏసు పుట్టుకకు ముందు ఏం జరిగింది!


ABP Desam


సుమారు 2 వేల సంవత్సరాల క్రితం రోమ్ ను పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత మంది ప్రజలున్నారో లెక్కించాడు. ఈ లెక్కలను ఈజీగా సేకరించేందుకు ప్రజలంతా ఎవరి స్వగ్రామాలకు వారు డిసెంబర్ 25వ తేదీలోపు చేరుకోవాలని ఆదేశించాడు.


ABP Desam


అదే సమయంలో రోమన్ రాజ్యంలో నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ పెళ్లి నిశ్చయమైంది. ఒకరోజున మేరీకి గాబ్రియేల్ అనే దైవదూత కలలో కనబడి ‘ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మనిస్తావని చెప్పాడు.


ABP Desam


పుట్టే బిడ్డకు ఏసు అనే పేరు పెట్టాలని చెప్పింది. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. ఆ తర్వాత అచ్చం దేవదూత చెప్పిన విధంగానే మేరీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.


ABP Desam


ఆ తర్వాత ఒకసారి జోసెఫ్ కలలో కనిపించిన దైవదూత ‘మేరీని విడిచిపెట్టకు.. ఆమె దేవుని వరంతో గర్భం దాల్చిందని..ఆమెకు పుట్టిన బిడ్డ దేవుడి బిడ్డ..నమ్మిన ప్రజలకు పాపాల నుంచి విముక్తి కల్పిస్తాడని చెప్పాడు. దైవదూత మాటమేరకు జోసెఫ్..మేరీని ప్రేమతో ఆదరించాడు.


ABP Desam


రాజు ఆదేశాల మేరకు జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమై బెత్లేహామ్ కు వెళ్లినప్పటికీ వారికి ఉండటానికి చోటు దక్కలేదు. చివరికి ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు.


ABP Desam


అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తుండగా.. ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఓ వెలుగు రావడంతో గొర్రెల కాపరులంతా భయపడ్డారు.


ABP Desam


అప్పుడు దైవదూత ‘మీరు భయపడొద్దు.. ఓ శుభవార్తను చెప్పడానికి ఇక్కడికొచ్చాను ఈరోజు లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు అని అన్ని ఆనవాళ్లు చెబుతాడు.


ABP Desam


పశువుల పాకలో పుట్టిన బిడ్డని చూసి దేవదూత చెప్పిన విషయాన్ని ఆ గొర్రెల కాపరులు అందరికీ చెబుతారు. అప్పుడు సమయం డిసెంబరు 24 అర్థరాత్రి. అప్పటి నుంచి డిసెంబర్ 25వ తేదీన ఏటా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు.


ABP Desam


Images Credit: Freepik