క్రిస్మస్ ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సన్నిహితులతో డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవాలని అనుకునే వారికి మేం కొన్ని టిప్స్ చెబుతున్నాం.
1. శాంటాగా మారిపోండి. క్రిస్మస్ అనేది కానుకల పండుగ. అందుకే మీరే శాంటా క్లాజ్‌గా మారిపోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకే కాదు.. రాత్రిళ్లు మురికి వాడలకు వెళ్లి అక్కడి పిల్లలకు కూడా బహుమతులను అందించండి. దీనివల్ల మీరు పొందే ఆనందం అనిర్వచనీయం.
2. అనాథాశ్రమాలకు వెళ్లండి ఈ ఏడాది కాస్త కొత్తగా కుటుంబ సభ్యులతో పాటూ అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలకు విభిన్న బహుమతులు ఇచ్చేందుకు ట్రై చేయండి. వారు అడిగింది కొనిచ్చే అమ్మానాన్నలు లేరుకాబట్టి శాంటా రూపంలో అమ్మానాన్నగా మారి వారిని ఆనందపరిస్తే అంతకుమించిన పండుగ మరేముంటుంది.
3. కేక్, కుకీస్, వంటకాలు చేసుకోండి. క్రిస్మస్ అంటేనే కేకుల సంబరం. నెల రోజుల ముందునుంచీ కేకుల తయారీలో బిజీగా ఉంటారు. రమ్ కేక్, కుకీస్, పేస్ట్రీలు, హాట్ చాక్లెట్స్ తయారుచేస్తుంటారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ చేసేవి కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయండి.
4.‘క్రిస్మస్ ట్రీ’ని అలంకరించండి. క్రిస్మస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ. దీని అలంకారం ఓ ఆర్ట్. మీ క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి అందరి కన్నా భిన్నంగా క్రిస్మస్ ట్రీ అలంకరించండి. దానికింద కొన్ని బహుమతులు పెట్టి ఇంట్లో పిల్లలు ఉంటే వారికి, లేదంటే చుట్టుపక్కల పిల్లలకు పంచండి.
5. ఇంటిని డెకరేట్ చేయండి. ఏ పండుగకైనా ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరిస్తుంటాం. కాస్త విభిన్నంగా అలంకరించేందుకు ప్లాన్ చేసుకోండి. చిన్న చిన్న స్టార్స్, గిఫ్ట్ బాక్సులు, పేపర్ ఫ్లవర్స్.. వీటితో పాటు క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయగా మిగిలిన వస్తువులతో కూడా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు.
6. స్నేహితులతో పార్టీ స్నేహితులతో పార్టీ అనేది కామన్. కానీ క్రిస్మస్ సందర్బంగా పార్టీ డిఫరెంట్ గా ఉండాలంటే హోటల్స్ లో కాకుండా ఇంట్లోనే జరుపుకోండి. రంగురంగుల లైట్లతో ఇంటిని డిస్కోలా మార్చేసి ఎంజాయ్ చేయండి.
7. రొమాంటిక్ క్యాండల్ లైట్ డిన్నర్.. ఫ్రెండ్స్ తో పార్టీ సంగతి సరే..మరి మీ మనసుకి దగ్గరైనవారి సంగతేంటి.. అందుకే స్నేహితులతో పార్టీ పూర్తైన వెంటనే మీ మనసుకి దగ్గరైన వారితో రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి. ఇందులో క్రిస్మస్ స్పెషల్ రెసిపీస్ అన్ని ఉండేలా చూసుకోండి. కుదిరితే ఇంట్లో లేదంటే హోటల్లో
8. క్యాంప్ ఫైర్ వేసుకోండి హడావుడి మొత్తం పూర్తైన తర్వాత ఇంటి ఆవరణలో కానీ దగ్గర్లో ఉన్న పెద్ద గ్రౌండ్ లో కానీ క్యాంప్ ఫైర్ వేసుకుని ఎంజాయ్ చేయండి.