Horoscope Today 02 December 2024: ఈ రాశులవారు అందర్నీ నమ్మేసి వ్యక్తిగత విషయాలు చెప్పేసుకోవద్దు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 02st December 2024
మేష రాశి
ఈ రోజు మీరు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కొన్ని పనులకు సంబంధించి పెద్ద ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఇతరులకు ఎలాంటి సలహాలు ఇవ్వకండి. మీ గౌరవం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్ర.
వృషభ రాశి
ఈ రోజు ప్రజలు మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఏదైనా ముఖ్యమైన అంశాలపై చర్చించవచ్చు. కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు.
మిథున రాశి
వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలకు ఈ రోజు అనుకూలమైనరోజు. కెరీర్లో మంచి అవకాశాలు లభిస్తాయి. రహస్య శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. అజాగ్రత్త కారణంగా పని పాడయ్యే అవకాశం ఉంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మీ సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు. పెండింగ్‌లో ఉన్న విషయాలను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు.
Also Read: డిసెంబరు 01 నుంచి 07 ఈ వారం ఈ రాశులవారికి అన్నీ శుభాలే!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో గొప్ప అవకాశాలను పొందుతారు. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. విద్యార్థులకు ఈ రోజు శుభప్రదం కాదు..పోటీ పరీక్షలు రాసేవారికి ఆశించిన ఫలితాలు రావు. వైవాహిక జీవితంలో అనుకోని వివాదాలుంటాయి. మీకు సన్నిహితంగా ఉన్నారని భావించి మీ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవద్దు.
సింహ రాశి
ఈ రోజు మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చర్చలతో తప్పుడు పదాలు వినియోగించవద్దు. మీ సహోద్యోగులు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది
కన్యా రాశి
ఈ రోజు వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు చాలా మంచి రోజు. ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలి సాధిస్తారు.
తులా రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. కార్యాలయంలో సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. సామాజిక సేవలో పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీరు ప్రమాద కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
Also Read: డిసెంబర్ మొదటివారం ఈ రాశులవారికి ధననష్టం ఉంటుంది జాగ్రత్త!
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. పాత మిత్రులను కలుస్తారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. భవిష్యత్తు గురించి ఏదో భయం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు ముఖ్యమైన పనులను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారు. ఒకేసారి అనేక పనులు చేయాలనే దూకుడు వద్దు..ప్రణాళిక ప్రకారం పనులు చేయాలి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు.
మకర రాశి
వైవాహిక సంబంధాలలో విభేదాలు ఉండవచ్చు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు ఉంటాయి.
కుంభ రాశి
భవిష్యత్ కోసం నూతన ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపారులకు ఈ రోజు మంచి రోజు...ఊహించిన లాభాలొస్తాయి. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. మీ పనితో పాటూ ఇతర కార్యకలాపాలపై శ్రద్ధ వహిస్తారు.
మీన రాశి
ఈ రోజు మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ బాధ్యతలపట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులతో విభేదాలు రావొచ్చు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది.
Also Read: పోలి స్వర్గం/పోలి పాడ్యమి పూజా విధానం - కార్తీకమాసం ఫలితం మొత్తం ఈరోజే వచ్చేస్తుంది!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.