Weekly Horoscope 01 To 07 December 2024: డిసెంబర్ మొదటివారం ఈ రాశులవారికి ధననష్టం ఉంటుంది జాగ్రత్త!
Weekly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈవారం మీ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Weekly Horoscope 01 To 07 December 2024 In Telugu
మేషరాశి వారఫలం (Aries Weekly Horoscope)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. యువత కెరీర్‌లో విజయం సాధిస్తారు. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. మీరు స్నేహితునితో కలిసి నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు . వైవాహిక జీవితంలో వివాదాలుంటాయి. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వాహన ఆనందాన్ని పొందుతారు. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మిథునరాశి వారఫలం (Gemini Weekly Horoscope)
మిథున రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. స్నేహితుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. ప్రమాదకర పనులకు దూరంగా ఉండడం మంచిది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించవద్దు..లేదంటే చట్టపరమైన ఇబ్బందుల్లో పడతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
Also Read: శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
కర్కాటకరాశి వారఫలం (Cancer Weekly Horoscope)
ఈ వారం అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని పనుల్లో నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపార మందగమనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. బ్యాంకులో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఈ వారం విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. సంతోషకరమైన సందర్భాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగంలో ప్రశాంతత లభిస్తుంది.
కన్యారాశి వారఫలం (Virgo Weekly Horoscope)
ఈ వారం కన్యా రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. విద్యార్థులు పరీక్షల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తారు. నూతన వధూవరులు సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకండి.
వృశ్చికరాశి వారఫలం (Scorpio Weekly Horoscope)
వృశ్చిక రాశి వారు ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులను కాపాడుకోవడంలో అజాగ్రత్తగా ఉండకండి..లేదంటే నష్టపోతారు. స్నేహితుల నుంచి మీకు చెడు వార్తలు వినాల్సి రావొచ్చు. వాహనం జాగ్రత్తగా నడపండి. పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. యువత తమ కెరీర్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.
Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!
మీనరాశి వారఫలం (Pisces Weekly Horoscope)
మీన రాశి వారు ఈ వారం కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అప్పులకు సంబంధించి సాగుతున్న సమస్యలు ఇప్పట్లో తీరేలా లేవు. పూర్వీకుల నుంచి సాగుతూ వస్తున్న వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఈ వారం మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.