January 2023 Monthly Horoscope: 2023 ఆరంభం ఈ రాశివారికి తిరుగులేదు - మాటకు ఎదురు లేదు, జనవరి మాస ఫలితాలు
January Monthly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
January 2023 Monthly Horoscope in telugu: పాత ఏడాదికి గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాదిలో కోటి ఆశలతో అడుగుపెడతారు. ఈ సమయంలో ఏడాదిలో మొదటి నెల ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలనిస్తోందో చూద్దాం...
మేష రాశి
కుంభ రాశిలో సంచరిస్తోన్న శని..మేషరాశివారికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిపెట్టేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మతపరమైన కార్యకలాపాల ద్వారా ఆదాయం సంపాదించి, జీవనోపాధిని సంపాదించే వారు మంచి ఆదాయాన్ని పొందుతారు. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలుస్తారు
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ నెల గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు. పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఈ రాశివారికి చదువుపై తక్కువ ఆసక్తి ఉంటుంది...క్రీడలపై శ్రద్ధ పెడతారు. పొట్టకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని బాధపెడతాయి. ఆదాయం బావుంటుంది.
Also Read: 2023లో ఈ 5 రాశులవారు సక్సెస్ కి కేరాఫ్, కొన్నేళ్లుగా పడుతున్న కష్టాల నుంచి ఊహించనంత ఉపశమనం
కన్యా రాశి
ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూల గ్రహసంచారం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. రావాల్సిన డబ్బు పొందుతారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు సృజనాత్మకంగా ఆలోచించి లాభాలు పొందుతారు. స్నేహితుల నుంచి మద్దతు పొందే అవకాశం ఉంది. ఈ రాశి ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.
తులా రాశి
ఈ రాశి వ్యాపారులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే నష్టం ఉంటే ఈ నెలలో ఈ సమస్య తొలగిపోతుంది. తుల రాశి వారికి జనవరిలో ప్రయోజనం ఉంటుంది. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆశించిన పెరుగుదల ఉంటుంది. గ్రూపులతో కలసి పనిచేసే ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కోకతప్పదు..ఓపికతో పనిచేయాల్సిన అవసరం ఉంది. కంటికి, గొంతుకి సంబంధించిన సమస్యలతో బాధపడతారు
వృశ్చిక రాశి
2023 జనవరి వృశ్చిక రాశివారికి తిరుగులేదు. మీ మాటకు ఎదురులేదు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. సంతోషంగా ఉంటారు. పాతమిత్రులను కలుస్తారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. దాదాపు అన్ని విషయాలలో పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి.
Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు
మకర రాశి
కొత్త సంవత్సరం మకరరాశి వారికి ఆనంద వసంతాలను పంచబోతోంది. ఆర్థిక రంగం నుంచి మీకు శుభవార్తలు వస్తాయి, మీ కెరీర్‌లో విజయం సాధించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. మీరు ఏదైనా క్రీడతో అనుబంధం కలిగి ఉంటే విజయం సాధిస్తారు. పనిభారం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మనశ్సాంతి లోపిస్తుంది.