Jupiter transit 2023: 2023లో ఈ 5 రాశులవారు సక్సెస్ కి కేరాఫ్, కొన్నేళ్లుగా పడుతున్న కష్టాల నుంచి ఊహించనంత ఉపశమనం
Guru Margi 2023: మీ జాతకంలో బృహస్పతి అదృష్ట స్థానంలో ఉంటే, మీకు కష్టమైనప్పుడు కూడా సహాయం అందుతుంది. మరి కొత్త సంవత్సరం 2023లో బృహస్పతి ఆశీస్సులు పుష్కలంగా ఉండే రాశులేంటో చూద్దాం.
![Jupiter transit 2023: 2023లో ఈ 5 రాశులవారు సక్సెస్ కి కేరాఫ్, కొన్నేళ్లుగా పడుతున్న కష్టాల నుంచి ఊహించనంత ఉపశమనం Jupiter Transit 2023: These five Zodiac Signs Will Get someny benifits in 2023 year, know in details Jupiter transit 2023: 2023లో ఈ 5 రాశులవారు సక్సెస్ కి కేరాఫ్, కొన్నేళ్లుగా పడుతున్న కష్టాల నుంచి ఊహించనంత ఉపశమనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/e63b6f70061c78f24eac040aa3da91be1671584967317217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jupiter transit 2023: నవగ్రహాలు…జాతకాన్ని నిర్దేశించే గ్రహాలు. అందులో గురు గ్రహం (బృహస్పతి) అతి ప్రధానమైనది. దీని ప్రభావంతో జీవితంలో పలు కార్యాలను సులభంగా జయించవచ్చు. గురువు బాగుంటే అన్ని బాగున్నట్లే అంటారు. ఎన్ని గ్రహాలు నీఛ స్థితిలో ఉన్నా గురుగ్రహం అనుగ్రహం ఉంటే వాటి ప్రభావం అంతగా ఉండదని చెబుతారు జ్యోతిష్య పండితులు. విద్య, ఉపాధి, ఉద్యోగం, వివాహం, సంతానానికి సంబంధించిన తీరాలంటే గురుగ్రహ సంచారం బావుండాలి. బృహస్పతి ప్రభావంలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త ఏడాదిలో బృహస్పతి ఆశీస్సులు పుష్కలంగా ఉండే రాశులేంటో చూద్దాం.
మిధున రాశి
కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలకు కొత్త ఏడాదిలో ఉపశమనం లభించబోతోంది. తలపెట్టిన ప్రతిపనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు మంచి పేరు సంపాదిస్తారు. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు అనుభవజ్ఞులను సంప్రదించి ప్రారంభించవచ్చు..దానికి తగిన సహకారం కూడా మీకు అందుతుంది. ఈ ఏడాదిలో పెట్టే నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలరు. మీరు ఎలాంటి కెరీర్‌ను ఎంచుకున్నా అందులో మీ ప్రభావాన్ని చూపించగలరు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు..వారికారణంగా ప్రయోజనం పొందుతారు
Also Read: ఈ రాశులవారికి అనారోగ్యం, ఆ రాశుల వారికి ఆర్థిక లాభం, డిసెంబరు 19-25 వారఫలాలు
కర్కాటక రాశి
నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న ఈ రాశివారికి 2023 బాగా కలిసొస్తుంది. నూతన పెట్టుబడులు ధైర్యంగా పెట్టొచ్చు. ఆర్థికపరిస్థితి బాగున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. మీరు తండ్రినుంచి మద్దతు పొందుతారు. ఇంటిని కొనుగోలు చేయాలని, దాన్ని పునర్నిర్మించాలని ఉన్నవారికి శుభసమయం.
కన్యా రాశి
ఈ రాశివారికి వివాహానికి సంబంధించి ఉన్న సమస్యలు 2023లో తీరిపోతాయి. మీ సక్సెస్ ద్వారా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంటాబయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..అందుకుగల మార్గాలు అన్వేషించడంలో సక్సెస్ అవుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అవివాహితులు పెళ్లిచేసుకుంటారు. ఆహారం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు.
ధనుస్సు రాశి
2022 తో పోల్చుకుంటే 2023లో ధనస్సు రాశివారి కెరీర్ మెరుగుపడుతుంది. గణనీయమైన మెరుగుదల సాధించగలుగుతారు. మీలో కొందరు మీ వృత్తిపరమైన హోదాలో ప్రమోషన్లను సాధించవచ్చు. మీ తెలివితేటల ద్వారా మీరు పెద్ద లాభాలను పొందుతారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వివాదాలకు ముగింపు పలికేందుకు ఇదే మంచి సమయం..ఓ అడుగు తగ్గండి. వివాహితుల జీవితం బావుంటుంది.
Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు
మీన రాశి
కొత్త ఏడాదిలో మీకు గౌరవ మర్యాదలకు లోటుండదు. మీ లక్ష్యాలను సాధించడంలో సక్సెస్ అవుతారు. కొత్త కంపెనీలలో చేరాలి అనుకునేవారికి అనుకూలమైన సమయం. విదేశీ వ్యవహారాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది. ఆర్థిక, దీర్ఘకాలిక ప్రణాళికపై మీ దృక్పథం మెరుగ్గా మారుతుంది. మీ సన్నిహితులు , కుటుంబ సభ్యులు తరచుగా మార్గదర్శకత్వం కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు . మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది.
నోట్:ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)