Weekly Horoscope 19-25 December 2022:ఈ రాశులవారికి అనారోగ్యం, ఆ రాశుల వారికి ఆర్థిక లాభం, డిసెంబరు 19-25 వారఫలాలు
Weekly Horoscope 19-25 December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Weekly Horoscope 19-25 December 2022: ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో చూద్దాం...
మేష రాశి
ఈ వారం మేషరాశివారికి కొన్ని ఆర్థిక సవాళ్లుంటాయి. వారం మధ్యలో నష్టపోయే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోని సమస్యలు వారాంతానికి పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఇప్పుడిప్పుడే చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు తమ లక్ష్యాన్నిచేరుకోవడం కష్టమవుతుంది.
వృషభ రాశి
ఈ వారం మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్యలను లైట్ తీసుకోవద్దు. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి...హద్దులు దాటకండి. అవివాహితులు పెళ్లి దిశగా చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు క్రమశిక్షణ పాఠించాలి, అసంపూర్ణంగా ఉన్న కోర్సులు పూర్తిచేస్తారు. వ్యాపారులు లాభం కోసం పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించాలి. ఆర్థిక వ్యవహారాలు పూర్తిచేయడంపై కొంత శ్రద్ధ పెట్టండి
మిథున రాశి
మిథున రాశి వారు ఈ వారం వారి స్వభావంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో వివాదాల పరిస్థితి కూడా రావొచ్చు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ బాస్ దృష్టిలో మిమ్మల్ని తక్కువచేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నం చేయవచ్చు. వారం ప్రారంభంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. విద్యార్థులు తొందరపాటు తగ్గించుకోవాలి.
Also Read: భార్య భర్త కాళ్ళు ఎందుకు పట్టాలి- శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర లక్ష్మీదేవి ఎందుకు కూర్చుంటుంది!
కర్కాటక రాశి
వారంలో మొదటి మూడు రోజులు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కానీ వారం చివరిలో మానసిక ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఎదురవుతుంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు, వాదనలకు అవకాశం ఇవ్వొద్దు. ఈ వారం కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. ఈ రాశికి చెందిన డయాబెటిక్ రోగులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు తప్పుడు సహవాసం కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు
సింహ రాశి
ఈ వారం సింహరాశివారికి విజయంతో పాటూ కొన్ని సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ఆక్మస్మికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. కార్యాలయంలో మీపై వ్యతిరేకత పెరుగుతుంది కానీ మీరు మీ స్థానాన్ని బలంగా కాపాడుకోగలగుతారు. శత్రువులు చురుకుగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే సీనియర్ అధికారులు మీపై నిఘా ఉంచుతారు. విద్యార్థులు సమయాన్ని వృధాచేయకుండా జాగ్రత్తపడండి.
కన్యా రాశి
రాబోయే వారం మీకు ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు కొరత తీరుతుంది. మీ ముఖ్యమైన పనులు ఆగవు. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. మాటల్లో వినయం కోల్పోకుండా చూసుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రేమ భాగస్వామితో గడిపే అవకాశం లభిస్తుంది.
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, 30 రోజులు పాడే పాశురాల ప్రత్యేకత ఏంటి!
తులా రాశి
వారం ఆరంభం అద్భుతంగా ఉన్నా ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు తప్పవు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. వారం చివరిలో విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కోర్సు పూర్తి చేయడంలో ఆటంకాలు ఏర్పడతాయి. గురువుతో వాదించవద్దు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వారం ప్రారంభం మీకు సంతోషాన్నిస్తుంది. ఈ వారం మీరు మీ శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ ఆలోచనలు యజమానిని ఆకట్టుకుంటాయి. మీ ఇమేజ్‌ని బలోపేతం చేయడంలో మీరు విజయం సాధిస్తారు. సహోద్యోగుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొంతమంది మిమ్మల్ని మోసం చేయగలరు..ప్రణాళికల విషయంలో జాగ్రత్త. విద్యార్థులు సోమరితనానికి దూరంగా ఉండాలి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. వైవాహిక జీవితంలో టెన్షన్ పరిస్థితులు నెలకొంటాయి.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఈ వారం ప్రత్యేకం.సూర్యుడి సంచారంతో పాటూ శుక్రుడు, బుధ గ్రహాలు కూడా మీ రాశిలో సంచరిస్తున్నాయి. త్రిగ్రాహి యోగం వల్ల కొన్ని విషయాల్లో లాభం ఉంటే, కొన్ని నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. సంతానానికి సంబంధించి వైద్యలు సలహాలు తీసుకోవడం మంచిది. కొత్త వాహనం, ఆస్తుల కొనుగోలు విషయంలో ప్రణాళికలు రూపొందించవచ్చు. ఖర్చులు పెరుగుతాయి..ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది.వ్యాపారంలో డబ్బు చిక్కుకుపోవచ్చు.తెలివిగా పెట్టుబడి పెట్టండి.
మకర రాశి
ఈ వారం శని సంచారం వల్ల మీరు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఇప్పటికైనా చదువుపై శ్రద్ధ వహించాలి.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రావాల్సిన డబ్బు విషయంలో కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా సక్సెస్ అవుతారు.
కుంభ రాశి
ఈ వారం మీరు కొన్ని విషయాల్లో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని సంచారం కారణంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాల్సి ఉంటుంది. అనవసర విషయాలగురించి ఆరాటం తగ్గించుకుంటే మంచిది. వైవాహిక జీవితంలో కూడా కొంత గందరగోళం ఉండొచ్చు. మాటలో సున్నితత్వం మిస్సవకుండా చూసుకోండి.
మీన రాశి
ఈ వారం మీరు ఆనందంగా ఉంటారు. బృహస్పతి సంచారం మీకు కలిసొస్తుంది. ఇంట్లో ఏదైనా ఖరీదైన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఇంటా-బయటా గౌరవం పెరుగుతాయి. చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు విజయం సాధిస్తారు. వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కార్యాలయంలో కొత్త బాధ్యతలు భుజానికెత్తుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.