అన్వేషించండి

August 2025 Rajyog: ఆగష్టులో వరుసగా 2 శక్తివంతమైన రాజయోగాలు , ఈ 3 రాశుల వారికి ఆదాయం, గౌరవం పెరుగుతుంది!

August 2025 : ఆగష్టు నెలలో రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి. కొన్ని రాశులవారికి ధనలాభం, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి... మీ రాశి ఉందా ఇందులో..

August 2025 Auspicious Yog:  జ్యోతిష్య శాస్త్రంలో చాలా శుభయోగాలున్నాయి. గ్రహాల సంచారం ఆధారంగా యోగాలు ఏర్పడతాయి. గ్రహాల కదలిల వ్యక్తుల అదృష్టాన్ని మార్చుతుందని నమ్ముతారు. ధనం, వాహనం, ఆస్తికి సంబంధించిన అడ్డంకులు గ్రహాల కదలిక ద్వారా తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. ఆగష్టులో రెండురాజయోగాల కలయిక ఏర్పడుతోంది. ఈ ప్రభావంతో ఏ రాశులవారికి ప్రయోజనం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. 
 
2025 ఆగష్టులో రెండు శక్తివంతమైన రాజయోగాలు

ఆగస్టులో గ్రహాల కదలికలో పెద్ద మార్పు రాబోతోంది. ఇలాంటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి రెండు రాజయోగాలు ఏర్పడతాయి

మొదటి యోగం -  గజలక్ష్మీ రాజయోగం  (Gajalakshmi Rajyoga)

ఆగస్టు 20 వరకు మిథున రాశిలో శుక్రుడు మరియు గురువుల శుభ కలయికతో గజలక్ష్మీ రాజయోగం ఉంటుంది. ఈ యోగం ప్రభావంతో వ్యక్తికి ధనం, కీర్తి   గౌరవం లభిస్తాయి. ఈ గ్రహాల సంచారం శుభస్థానంలో ఉండే వ్యక్తి జీవితం రాజులా మారుతుంది. ఆ వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానం, ప్రతిష్ట  పొందుతారు

రెండవ యోగం - లక్ష్మీ నారాయణ యోగం (Lakshmi Narayan Raja Yoga)

ఆగస్టు 21 నుంచి కర్కాటక రాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో...చేపట్టే ప్రతిపనీ పూర్తవుతుంది. పోరాటం చేయవలసిన అవసరం లేదు..అనుకున్న పని అనుకున్న సమయానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. ధనానికి లోటుండదు. సమయానికి డబ్బు చేతికందుతుంది

ఈ రెండు రాజయోగాలతో ఈ రాశుల వారికి మంచి ప్రయోజనం ఉంటుంది

కర్కాటక రాశి (Cancer)

ఎప్పటి నుంచో ఆగిపోయిన పాత ధనం లభిస్తుంది. వ్యాపారంలో మీ కష్టం ఫలిస్తుంది. ధనధాన్యాలు లభిస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. మీరు ఏ పని చేసినా, అది విజయవంతంగా పూర్తవుతుంది.

వృషభ రాశి  (Taurus )

వృషభ రాశి వారికి కూడా ఆగస్టు చాలా అనుకూలంగా ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది. ఈ యోగం ప్రభావంతో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో గొప్ప విజయం లభిస్తుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకుంటారు.

మిథున రాశి (Gemini )

గజలక్ష్మీ రాజయోగం, లక్ష్మీ నారాయణ యోగం మిథున రాశివారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. సానుకూల మార్పులు కనిపిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు.  

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి. పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించండి

 శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget