జూన్ 8 రాశిఫలాలు: హోదా, గౌరవం తగ్గించే పనులకు ఈ రాశివారు దూరంగా ఉండాలి
Rasi Phalalu Today June 8th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Horoscope Today 8th June 2023: జూన్ 8 బుధవారం మీ రాశిఫలితాలు
మేషరాశి
ఒక పెద్ద వ్యాపారవేత్తతో కుదుర్చుకున్న ఒప్పందం లాభాలను ఇస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఆనందంగా ఉంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చెడు సహవాసాన్ని నివారించండి. తెలియని భయం, అడ్డంకులు తొలగిపోతాయి.
వృషభ రాశి
ఈ రోజు మీ ప్రయాణం సరదాగా సాగుతుంది. మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపారంలో అనుకూలమైన లాభం ఉంటుంది. స్టాక్ మార్కెట్ , మ్యూచువల్ ఫండ్స్ లో తెలివిగా పెట్టుబడి పెట్టండి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలుంటాయి
మిథున రాశి
అనవసర విషయాల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. ధనం వృధా అవుతుంది. విచారకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. అనవసర వివాదాల కారణంగా ఇబ్బంది పడతారు. పనిపై ఆసక్తి ఉండదు. లావాదేవీల విషయంలో అసహనం ప్రదర్శించవద్దు. సన్నిహిత వ్యక్తితో విభేదాలు రావచ్చు. వ్యాపారం చక్కగా సాగుతుంది. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. చిన్న చిన్నఅనారోగ్య సమస్యలు ఉండొచ్చు. మీ హోదాని, గౌరవాన్ని తగ్గించే పనులు చేయకపోవడమే మంచిది. ఆర్థిక ప్రగతికి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మిత్రులు మీకు సహకరిస్తారు. ధనలాభం ఉంటుంది.
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
సింహ రాశి
అనవసర మాటలు వద్దు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విశిష్ట అతిథులు ఇంటికి రావచ్చు. ఖర్చు పెరుగుతుంది. రిస్క్ తీసుకునే ధైర్యం చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. మీ చుట్టూ కొందరు దుష్టులున్నారు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు మరింతం కష్టపడితేనే లాభాలొస్తాయి.
కన్యా రాశి
వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉపాధి పొందడం సులభం అవుతుంది. వ్యాపార ప్రయాణాలు లాభిస్తాయి. ఊహించని లాభం ఉండవచ్చు. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. బంధువులను కలుస్తారు. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. పెద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆనందంగా ఉంటారు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు. తప్పుడు పనులు చేయవద్దు.
తులా రాశి
కొత్త కార్యక్రమాలు మొదలెట్టేందుకు ఈ రోజు మంచిరోజు. ఎవరికీ అప్పు ఇవ్వకండి. వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఎవరినీ గుడ్డిగా విశ్వసించకండి. ఆందోళన మరియు టెన్షన్ తొలగిపోతాయి. కొన్ని పనుల్లో సమస్యలు రావొచ్చు. క్రీడలతో సంబంధం ఉన్నవారికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం బాగా సాగుతుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు.
Also Read: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!
వృశ్చికరాశి
ఈరోజు మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటాయి. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ఆదాయం పెరుగుతుంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కొన్ని పనుల విషయంలో టెన్షన్ ఉంటుంది. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మీ పనితీరులో మెరుగుదల ఉంటుంది. భాగస్వామ్యం కోసం కొత్త ఒప్పందాలు ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సామాజిక సేవలో స్ఫూర్తి పొందుతాం. ఉద్యోగంలో లాభం ఉంటుంది.
మకర రాశి
ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కొత్తగా పరిచయం అయిన వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవద్దు. అనవసర వాదనలు పెట్టుకుంటారు. తొందరగా అలసిపోతారు. ఒకరి ప్రవర్తన వల్ల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కోర్టు పనులు పూర్తవుతాయి. మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. పిల్లల విజయంతో సంతోషిస్తారు.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వాహనాలు, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భూమికి సంబంధించిన పనులలో ప్రయోజనం ఉంటుంది. బంగారం, వెండి వస్తువులు జాగ్రత్త. శారీరక బలహీనత ఉంటుంది. పని చేయాలని అనిపించదు. సన్నిహితుల ప్రవర్తన అననుకూలంగా ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు రావచ్చు. ఉన్నతాధికారులు ఆశించిన స్థాయిలో ఉద్యోగులు పనిచేయలేరు.
మీన రాశి
ఈ రాశివారు విచక్షణతో వ్యవహరించండి. ధననష్టం ఉండొచ్చు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులు అనుభవజ్ఞుల నుంచి సలహాలు పొందుతారు. వ్యాపారాలు లాభాసాటిగా సాగుతాయి. పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మిత్రులను కలుస్తారు.