జూలై 10 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు జీవితభాగస్వామి ఉగ్రరూపం చూస్తారు!
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 10 సోమవారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today July 10, 2023
మేష రాశి
ఈ రోజు మేషరాశి వారి వ్యక్తిగత సమస్యలు స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు శుభసమయం. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీకున్న హక్కులను దుర్వినియోగం చేయవద్దు. ఆర్థిక పెట్టుబడులు లాభిస్తాయి.
వృషభ రాశి
ఈ రాశి వ్యాపారులకు చాలాకాలం తర్వాత లాభాలొస్తాయి. ఎవ్వరి ప్రభావానికి లోనుకావొద్దు..మీకు మీరుగా నిర్ణయం తీసుకుని పనిచేస్తే మంచి ఫలితాలుంటాయి. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు..అయితే మీకు ఈ ప్రయాణం కలిసొస్తుంది. పనిపట్ల పట్టుదల మీకు మంచి గుర్తింపును తీసుకొస్తుంది. ఉద్యోగులు బదిలీ లేదా ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది.
మిథున రాశి
ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆశక్తి పెరుగుతుంది. పనిపట్ల పట్టుదల, శ్రద్ధ ఎక్కువవుతుంది. ఉద్యోగులు బదిలీకి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారం బాగా సాగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
Also Read: ఈ వారం ఈ రాశులవారు ఆర్థికవ్యవహారాలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి!
కర్కాటక రాశి
ఈ రాశివారు ఈ రోజు తమ జీవిత భాగస్వామి ఉగ్రరూపాన్ని చూస్తారు. కుటుంబ వ్యవహారాలపై పూర్తిస్థాయి శ్రద్ధ వహించి పనులు పూర్తిచేయడం మీకు చాలా మంచిది. వ్యాపారంలో వినూత్న కార్యకలాపాలు చేపట్టడం అనుకూలం. పెండింగ్ లో ఉన్న పనులు సైతం మీ తెలివితేటలతో పూర్తిచేసేస్తారు.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజంతా ఏదో గందరగోళంగా ఉంటుంది. ఇంటా బయటా వివాదాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారులు నూతన పట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులుకు పనిపట్ల శ్రద్ధే శ్రీరామరక్ష.
కన్యా రాశి
ఈ రాశివారు అనవసరమైన ప్రదర్శనలు , ఆడంబరాలకు దూరంగా ఉండాలి లేకుంటే సమస్యలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలోనూ శ్రద్ధ వహించండి. పిల్లల మొరటు ప్రవర్తనను కూడా మీరు ఆస్వాదిస్తారు. వ్యాపారులకు పనిపై శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మాటలు పడే అవకాశం ఉంది..కార్యాలయంలో అప్రమత్తంగా వ్యవహరించండి.
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి అనుభవాలతో నిండిన రోజు అవుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటుంది. మీ కీర్తి పెరుగుతుంది. వ్యక్తిగత ఖర్చులు ఎక్కువవుతాయి. సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు.ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
Also Read: జూలై నుంచి అక్టోబరు వరకూ ఈ 4 రాశులవారికి మహారాజయోగం!
వృశ్చిక రాశి
ఆదాయానికి మించి ఖర్చులు చేయొద్దు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు వ్యాపారంలో ఒత్తిడిని తొలగిస్తాయి. వ్యాపారంలో కొత్త ప్రతిపాదనలు మనస్సులో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
ధనుస్సు రాశి
ఈ రోజు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఈరోజు స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఎవరితోనూ జోక్ చేయవద్దు..అదే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.
మకర రాశి
మీ ఆనందం కోసం ఇతరులను కించపరిచేందుకు ప్రయత్నించకండి. పోటీ పరీక్షలకోసం కష్టపడుతున్న వారు మరింత శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు, వ్యాపారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో వివాదం జరిగే అవకాశం ఉంది. అనవసర కోపాన్ని ప్రదర్శించకండి.
కుంభ రాశి
ఈ రోజు ప్రారంభం నుంచి మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టే అనిపిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న ధనం చేతికందుతుంది. మీ తెలివితేటలతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పిల్లల భవిష్యత్ కోసం నూతన ప్రణాళికలు వేసుకుంటారు. తొందరపడి ఏ పనీ చేయకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
మీన రాశి
ఈ రోజు మీన రాశివారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార ఆశాజనకంగా సాగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. స్నేహితులను కలుస్తారు. సంతోషంగా ఉంటారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.