అన్వేషించండి

Weekly Horoscope 2023 July 10 to 16: ఈ వారం ఈ రాశులవారు ఆర్థికవ్యవహారాలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

2023 జూలై 10 నుంచి జూలై 16 వారఫలాలు: ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో ఫలితాలు తెలుసుకోండి...

Weekly Horoscope 2023 July 10 to 16:
మేష రాశి 
ఈ వారం మీకు కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీరు పనిచేసే రంగంలో ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. ఓర్పుగా ఉండాలి, కష్టపడి పనిచేయాలి. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించండి . ఖర్చులపై నియంత్రణ పాటించండి. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల ప్రేమను పొందుతారు. 

వృషభ రాశి
ఈ వారం మీరు మీ కుటుంబం, మీ ఇంటి వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కొత్తగా భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలి. ఆహారంపై శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. వ్యాపారంలో పురోగతి కోసం సమయపాలనపై శ్రద్ధ వహించండి.

మిథున రాశి
ఈ వారం కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలోపేతం చేసే అవకాశం లభిస్తుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. మీరు మాట్లాడే విధానం స్పష్టంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిది.

Also Read: కర్కాటక రాశిలో బుధుడి సంచారం - ఈ 5 రాశులవారికి అనుకూలం!

కర్కాటక రాశి 
ఈ వారం మీ వ్యాపారంలో స్థిరత్వం , శ్రేయస్సుకు అవకాశం ఉంటుంది.  కొత్త ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేయండి. మీ శక్తి సామర్థ్యాలను సక్రమంగా వినియోగించండి. డబ్బుకు సంబంధించిన ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు . మీరు తలపెట్టే పనులకు వారినుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

సింహ రాశి
ఈ వారం మీరు వృత్తిలో విజయం సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఈవారం ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా ఆ వారాంతానికి కొన్ని విజయాలు సాధిస్తారు. మీ ప్రొఫెషనల్ గ్రాఫ్ నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబం, భాగస్వామితో సంబంధాలు శాశ్వతంగా ఆహ్లాదకరంగా ఉండటానికి సమయం కేటాయించండి. మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేందుకు  క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

కన్యా రాశి
ఈ వారం మీరు వ్యాపారం , కార్యాలయంలో మరింత కష్టపడాలి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి - కొత్త బాధ్యతలు అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. మీ నైపుణ్యాలను ఉపయోగించండి మరియు మీ వర్క్ స్పేస్ లో కొత్త మరియు ఉత్తేజకరమైన ప్రాజెక్టులను కనుగొనండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ఖర్చులపై నియంత్రణ పాటించండి. కుటుంబం, స్నేహితులతో సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.  ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

తులా రాశి
ఈ వారం మీరు పునిచేసే ప్రదేశంలో పనిపై దృష్టిసారించాలి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఓపికంగా ఉండాలి. మరింత కష్టపడాలి.  కొత్త ప్రణాళికను ప్రారంభించండి దానిపై క్రమం తప్పకుండా పనిచేయండి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండి సరైన పెట్టుబడులు పెట్టండి. కుటుంబం ,  భాగస్వామి సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

వృశ్చిక రాశి 
ఈ వారం వ్యాపారానికి సంబంధించిన విషయాలలో స్థిరత్వం, శ్రేయస్సు పొందే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుంటారు. మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగించి జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

ధనుస్సు రాశి 
ఈ వారం మీరు  ఓ కొత్త ప్రాజెక్టును లేదా కొత్త పనిని ప్రారంభించే అవకాశాలున్నాయి. భాగస్వామ్య వ్వాపారం పుంజుకుంటుంది. మీరు రాజకీయాలు లేదా సామాజిక రంగంలో చురుగ్గా ఉంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ గుర్తింపును కాపాడుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం జాగ్రత్త. పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Also Read: జూలై నుంచి అక్టోబరు వరకూ ఈ 4 రాశులవారికి మహారాజయోగం!

మకర రాశి
ఈ వారం మీరు ఆఫీసు లేదా పని ప్రదేశంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.  మీ లక్ష్యాల వైపు దృష్టి పెట్టండి. వ్యాపార విషయాలలో అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సవాళ్లను ఎదుర్కొనే మీ నైజం కొత్త మార్గాలకు దారితీస్తుంది. కుటుంబానికి సమయం కేటాయించాలి, దీర్ఘకాలిక వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. 

కుంభ రాశి
ఈ వారం మీ నైపుణ్యం మెరుగుపడుతుంది. మీ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులు, వ్యవసాయ రంగంలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేయండి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండి సరైన పెట్టుబడులు పెట్టండి. 

మీన రాశి 
ఈ వారం ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో చురుగ్గా ఉండాలి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సరైన ప్లానింగ్ వల్ల సమయానికి లక్ష్యాలు సాధిస్తారు. మీ కళానైపుణ్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. పొదుపుపై దృష్టి పెట్టండి. ధననష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబానికి సమయం కేటాయించండి. సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget