అన్వేషించండి

Budh Gochar 2023: కర్కాటక రాశిలో బుధుడి సంచారం - ఈ 5 రాశులవారికి అనుకూలం!

ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు జూలై 8 నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈనెల 25 వరకూ అంటే దాదాపు మూడు వారాల పాటూ కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఈ  ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది.

Budh Gochar 2023: బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, సంపద, వాణిజ్యం మరియు చర్చల గ్రహంగా పరిగణిస్తారు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు జూలై 8 నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈనెల 25 వరకూ అంటే దాదాపు మూడు వారాల పాటూ కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఈ  ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే కొన్ని రాశులవారిపై అనుకూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఐదు రాశులవారికి కర్కాటకంలో బుధుడి సంచారం వల్ల మంచిజరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు, ఉద్యోగ, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. 

మేష రాశి

కర్కాటక రాసిలో బుధుడి సంచారం వల్ల మేష రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి..ఖర్చులు తగ్గుతాయి, అప్పులు తీరుతాయి. వాహనం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటే ఆ కోర్కె నెరవేరుతుంది. ప్రేమ జీవితం,వైవాహిక జీవితం బావుంటుంది. ఆస్తి తగాదాల వల్ల కొంత చికాకుగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

వృషభ రాశి

బుధుడి సంచారం వృషభ రాశి వారికి జీవితంలో పురోగతిని కలిగిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇది సరైన సమయం కాదు.

Also Read: ఈ సారి రెండు శ్రావణమాసాలు, మరి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు!

కర్కాటక రాశి

మీ రాశిలోని బుధుడు సంచరిస్తున్నాడు. ఫలితంగా కర్కాటక రాశివారికి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఎప్పటినుంచో చేతికిరాదు అనుకున్న డబ్బు అనుకోకుండా అందుతుంది. వెంటాడుతున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది.  తప్పనిపరిస్థితుల్లో తప్ప దూరప్రయాణాలు చేయకపోవడమే మంచిది

కన్యా రాశి

బుధుడి సంచారం మీకు మంచి చేస్తుంది. ఉద్యోగం, వ్యాపారం పరంగా ఇదే అనుకూలమైన సమయం. తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు కూడా ఇది మంచి సమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఊహించినదానికన్నా లాభం ఎక్కువగా ఉంటుంది.

Also Read: సింహరాశిలో శుక్ర సంచారం, మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!

తులా రాశి

బుధుడి సంచారం తులారాశివారికి జీవితంలో ఊహించని మార్పులు తీసుకొస్తుంది. అనుకున్న పనులు, అనుకోకుండా ప్రారంభించిన పనులు కూడా పూర్తవుతాయి. పనిపట్ల అంకితభావం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు పడుతుంది.   కొత్త ఉద్యోగం సంపాదిస్తారు. మీ పనిపై శ్రద్ధ పెరుగుతుంది

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget