Venus in Leo Transit 2023: సింహరాశిలో శుక్ర సంచారం, మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని ప్రేమ, వైవాహిక ఆనందం, విలాసం, కీర్తికి అధిపతిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం ఆహ్లాదకరంగా ఉంటుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
Venus in Leo Transit 2023: జూలై 5 వరకూ కర్కాటక రాశిలో సంచరించిన శుక్రుడు జూలై 6 గురువారం నుంచి సింహరాశిలో సంచరిస్తున్నాడు. జూలై 23 నుంచి కూడా అదే రాశిలో తిరోగమనం చెంది తిరిగి ఆగస్టు 5 నుంచి కర్కాటక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి.
మేష రాశి
శుక్రుడి రాశి మార్పు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంది. ఈ కాలంలో ప్రేమ సంబంధాలు బలపడతాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. మీరు మీ బంధం విషయంలో సీరియస్ గా ఉంటారు. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. వివాహితుల జీవితం బావుంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కూడా శుక్రుడి సంచారం శుభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు కొంచెం కష్టపడినా అధిక ఫలితాలు పొందుతారు.
మిథున రాశి
మిథున రాశి వారికి సింహ రాశిలో శుక్రుడి సంచారం అత్యంత లాభదాయకం. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ధార్మిక ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. మనసు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది.
Also Read: వీధిపోటు ఈ దిశగా ఉంటే ఆస్తి నష్టం, కోర్టు కేసులు - ఆ 4 దిశల్లో ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం!
కర్కాటకరాశి
సింహ రాశిలో శుక్రుడి సంచారం కర్కాటక రాశివారి జీతంలో ప్రకాశం నింపుతుంది. మీ వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది. మీ మాటతీరు మారుతుంది, అందరితోనూ కలిసేందుకు ప్రయత్నిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లాభాలుంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ప్రమాదం పొంచి ఉంది. సోదరులతో వివాదం ఉండొచ్చు.
సింహ రాశి
మీ రాశిలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదకరమైన, బాధ్యతారహితమైన పనులకు దూరంగా ఉండండి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ మనో ధైర్యమే మీకు శ్రీరామరక్ష.
కన్యా రాశి
శుక్రుడి సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది కానీ కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యం వద్దు. నిరుద్యోగలు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. అర్థవంతమైన సంబంధాలు మీకు ప్రయోజకరంగా ఉంటాయి.
తులా రాశి
ఈ రాశివారు ఆర్థిక పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. అయితే అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాతే రంగంలోకి దిగడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు భగవంతుడిపై విశ్వాసం పెరుగుతుంది.
Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ వాహనం( టూ వీలర్ or ఫోర్ వీలర్) ఏ రంగు ఉండాలో తెలుసా!
వృశ్చిక రాశి
శుక్రిడి సంచారం సమయంలో మీ కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త, ఖర్చులు తగ్గించడం మంచిది. అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన ప్రణాలికలు అమలు చేసేందుకు ఇదే మంచి సమయం.
ధనుస్సు రాశి
శుక్రుడి సంచారం సమయంలో ధనస్సు రాశివారి సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
మకర రాశి
సింహ రాశిలో శుక్రుడి సంచారం మకర రాశివారి జీవితంలో సంతోషం నింపుతుంది. నిన్నటి వరకూ గందరగోళంగా ఉన్న పరిస్థితి నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం బావుంటుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
కుంభ రాశి
ఈ రాశివారి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది కానీ అనవసర ప్రసంగాలు ఆపేస్తే మంచిది. మీ ప్రవర్తనపై విమర్శలొస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇంకొన్నాళ్లు ఆ ఇబ్బందులు తప్పవు. మాటలు తగ్గించడం మంచిది
మీన రాశి
ఈ రాశివారికి శుక్రుడి సంచారం పెద్దగా కలసిరాదు. తలపెట్టిన పనుల్లో ఆంటకాలు ఏదురవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.