అన్వేషించండి

Rahu Gochar 2023: జూలై నుంచి అక్టోబరు వరకూ ఈ 4 రాశులవారికి మహారాజయోగం!

ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు రాహువు. అక్టోబరు ఆఖరు వరకూ ఇదే రాశిలో ఉంటాడు. రాహు ప్రభావం అన్ని రాశులపైనా చెడు ప్రభావమే కాదు కొన్ని రాశులవారిపై మంచి ప్రభావం చూపిస్తుంది..ఆ రాశులేవో చూద్దాం..

Rahu Gochar 2023:  శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహువు కూడా ఒకటి. ఏప్రిల్ నుంచి మేష రాశిలో సంచరిస్తున్న రాహువు అక్టోబరు నెలాఖరు వరకూ ఇదే రాశిలో ఉంటాడు. అక్టోబరు 28 న మీన రాశిలోకి వెళతాడు. అంటే దాదాపు నాలుగు నెలల పాటూ ఈ నాలుగు రాశులవారికి అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా రాహువు అంటే చెడు మాత్రమే చేసే గ్రహం అనుకుంటారు. అయితే రాహువు సంచారం కొన్ని రాశులవారికి శుభఫలితాలనిస్తుంది. మేష రాశిలో రాహువు సంచారం వల్ల లాభపడే ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకోండి. 

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

మేష రాశిలో రాహువు సంచారం కర్కాటక రాశివారికి బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారులు లాభపడతారు. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఐటీ రంగానికి చెందినవారు ప్రమోషన్ పొందుతారు. తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే సరైన సమయం. 

Also Read: శనివారం ఈ ప‌రిహారాల‌తో శని దోషం తప్పకుండా తొలగిపోతుంది

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రాశి 10వ ఇంట్లో రాహువున్నాడు. దీంతో అనుకున్న పని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సిన పరిస్తితి వస్తుంది. ఉద్యోగులకు శుభసమయం. ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కొంత నియంత్రణ పాటించండి. ఉద్యోగులు వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. మీ లక్ష్యాలను సాధిస్తారు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఇల్లు కొనుగోలు దిశగా అడుగేస్తారు. 

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశివారికి ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు రాహువు.ఈ ప్రభావంతో ఉద్యోగం లేనివారు ఓ ఉద్యోగంలో స్థిరపడతారు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. గతంలో మధ్యలోనే ఆపేసిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. 

Also Read: ఈ రాశివారు మాటిస్తే తప్పకుండా నెరవేర్చుతారు, జూలై 8 రాశిఫలాలు

కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

ఈ రాశినుంచి రాహువు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సందర్భంగా వ్యాపారం విస్తరిస్తుంది. మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉద్యోగం మారేందుకు ఇదే మంచి సమయం. నిరుద్యోగులు ఓ ఉద్యోగంలో స్థిరపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రాహువు సంచారం ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. 

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget