Nepal Gen Z outcry: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ - పిచ్చెక్కినట్లు యువత అలజడి - కాల్చి చంపుతున్న నేపాల్ ఆర్మీ
Nepal Banned Social Media protestors clash with police outside Parliament

Nepal Social Media Ban protests: నేపాల్ రాజధాని కాఠ్మండులో జెన్ జీ (Gen Z) యువత నేతృత్వంలో భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రధాని కెపి శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై బ్యాన్ విధించింది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను బ్యాన్ చేయడంతో యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టిక్‌టాక్ పై మాత్రం నిషేధం విధఇంచలేదు.
#WATCH | Kathmandu, Nepal | Protestors climb over police barricades as they stage a massive protest against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites. pic.twitter.com/mHBC4C7qVV
— ANI (@ANI) September 8, 2025
సోషల్ మీడియా యాప్స్ తో పాటు ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తూ యువత పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ ఉద్యమం ఆన్‌లైన్ ఆందోళనగా మొదలై, పార్లమెంట్ భవనంపైకి దాడి చేసే వరకూ వెళ్లింది. యువత పార్లమెంట్ లోపలికి చొచ్చుకుపోయారు. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణల్లో 5 మంది మృతి చెందగా, 80 మందికి పైగా గాయాలయ్యాయని ప్రాథమిక ససమాచారం ఆందోళనకారులు మోటార్ సైకిళ్లు తగలబెట్టడం, ప్రభుత్వ ఆఫీసులపై దాడులు చేయడంతో పరిస్థితి తీవ్రమైంది.
My country is fucked 🙏
— Anony (@de_broglie23) September 8, 2025
First indonesia now its nepal
It's good though cuz us youths are atleast fighting for it
( context : government banned almost all of social media in nepal )#Corruption #nepal #GenZ #protest pic.twitter.com/U1EdjLZP7w
ప్రభుత్వం ఖాఠ్మండు, పోఖరా వంటి నగరాల్లో కర్ఫ్యూ విధించింది. నేపాల్ ఆర్మీని రంగంలోకి దింపింది. ప్రధాని ఓలి ఈ నిషేధాన్ని "దేశీయ గౌరవం" కోసం తీసుకున్న నిర్ణయంగా సమర్థించుకున్నారు. సోషల్ మీడియా కంపెనీలు స్థానికంగా రిజిస్టర్ చేసుకోవాలని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే, ఆందోళనకారులు దీనిని ప్రభుత్వ అణచివేతగా, అవినీతి , అసమర్థతకు వ్యతిరేకంగా చూస్తున్నారు. "ఓలి చోర్, దేశం ఛోడ్" (ఓలి దొంగ, దేశం వదిలి వెళ్లు) అంటూ ఉద్యమం చేస్తున్నారు.
🚨Breaking news:- Youth brigade's fierce protest against Nepal government in Kathmandu, youth took to the streets against corruption and social media ban.
— Aman Verma (@aman9950) September 8, 2025
This movement of Nepali youth is absolutely justified.💪🔥#socialmediaban#Nepal #kathmandu #protest pic.twitter.com/f9E7mZrlg9
ఈ ఉద్యమం నేపాల్ చరిత్రలో యువత నేతృత్వంలో జరిగిన అతిపెద్ద ఆందోళనల్లో ఒకటిగా నిలుస్తోంది. హ్యాష్‌ట్యాగ్‌లు #NepoKid, #NepoBabies, #GenZprotestnepal వంటివి ట్రెండింగ్ అవుతున్నాయి. సెలబ్రిటీలు కూడా ఈ ప్రదర్శనలకు మద్దతు తెలుపుతున్నారు. ప్రదర్శనకారులు స్టూడెంట్ యూనిఫారమ్‌లు ధరించి, బుక్స్ పట్టుకుని ర్యాలీలు చేస్తున్నారు.





















