Horoscope Today Dec 29th, 2023: ఈ రాశులవారు రిస్క్ తీసుకునేందుకు ఆలోచించకూడదు, డిసెంబరు 29 రాశిఫలాలు
Daily Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
Daily Horoscope Today December 29th, 2023 ( డిసెంబరు 29 రాశిఫలాలు)
మేష రాశి (Aries Horoscope Today)
ఈ రాశివారి ప్రేమ జీవితంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. సమస్యలు వచ్చినట్టే వచ్చి వెంటనే బయటపడతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ వ్యక్తిగత , వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇంటి ఆహారంపై శ్రద్ధ వహించండి. వ్యాయామంతో రోజు ప్రారంభించండి.
వృషభ రాశి (Taurus Horoscope Today)
ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. సంబంధాలలో విభేదాలు తొలగిపోతాయి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అధికారిక సమావేశాలలో మీ అభిప్రాయాలను తెలియజేయడానికి సంకోచించకండి. ఈరోజు మీ అభిప్రాయానికి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగంలో చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు కానీ మీ పనితీరు బాగానే ఉంటుంది. ఈ రోజు ఆర్థిక విషయాలలో పెద్దగా సమస్యలు ఉండవు. విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది.
Also Read: ఈ రాశివారికి 2024 లో కెరీర్ బావుంటుంది కానీ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు తప్పవ్!
మిథున రాశి (Gemini Horoscope Today)
ఉత్తేజకరమైన క్షణాలు ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉంటారు. ఉద్యోగం మారాలనే ఆలోచన విరమించుకోవడం మంచిది. మీరు భవిష్యత్తులో మంచి అవకాశాలను పొందవచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈరోజు శుభవార్త అందుతుంది. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు తెలివిగా పెట్టుబడి పెట్టాలి. మీ ఆర్థిక ప్రయోజనాలు మెరుగుపడతాయి. ఆస్తి , పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. తొందరపడి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి
కర్కాటక రాశి (Cancer Horoscope Today)
ఈ రాశివారి ప్రేమ జీవితం బావుంటుంది. వృత్తి జీవితంలో మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బావుంటుంది. కార్యాలయంలో సృజనాత్మకతతో చేసే పనులు విజయవంతమవుతాయి. ఆఫీసు రాజకీయాలకు దూరం పాటించండి. ఎలాంటి వివాదాల్లోకి రావద్దు. జట్టు సభ్యులతో కలిసి పని చేయండి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సోదరులు , సోదరీమణుల మధ్య డబ్బుకు సంబంధించిన వివాదాలు పెరగవచ్చు.
సింహ రాశి (Leo Horoscope Today)
ఈ రాశివారు అహంకారం తగ్గించుకోవడం చాలా మంచిది లేదంటే బంధాల మధ్య చీలిక వచ్చే అవకాశం ఉంది. ఓర్పుతో ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ వనరులు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మరోసారి ఆలోచించడం మంచిది. తొందరపాటు పనులకు దూరంగా ఉండాలి. కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Also Read: 2024 లో ఈ రాశివారికి డబ్బుకి లోటుండదు కానీ మనశ్సాంతి ఉండదు!
కన్యా రాశి (Virgo Horoscope Today)
కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగించేందుకు ప్రయత్నించండి. ఉద్యోగం మారాలి అుకుంటే ఇదే మంచి సమయం. కొంతమందికి పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు సంబంధించి సమాచారం వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృద్ధుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి.
తులా రాశి (Libra Horoscope Today)
ఈ రోజు మీలో కొత్త శక్తి నిండి ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. సవాళ్లను సులభంగా అధిగమిస్తారు. పట్టుదలతో చేసే పనులు విజయవంతమవుతాయి. మీపై మీరు విశ్వాసం ఉంచుకోండి. ఆర్థిక సంబంధిత విషయాల్లో రిస్క్ తీసుకునేందుకు ఆలోచించవద్దు. కొత్త విషయాలను అన్వేషించండి. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. కెరీర్ లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ఈరోజు మంచిది.
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
ఈ రాశివారి ప్రేమ ఫలిస్తుంది. మీ భావాలను భాగస్వామితో పంచుకోవడం మంచిది. సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ మీకు విశ్రాంతి అవసరం. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించాలి. అప్పులు తీర్చగలరు. ఖర్చులను ఆదా చేసి ఆదాపై దృష్టి సారించాలి.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ బాధ్యతలను నిజాయితీగా నిర్వరిస్తారు. విలువలతో రాజీ పడకండి. ఎలాంటి కారణం లేకుండా గొప్ప కోసం లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయవద్దు. పెట్టుబడులకు ఇదే మంచి సమయం. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆలోచనాత్మకంగా పెట్టుబడులు పెట్టండి. వ్యాయామంపై దృష్టి సారించాలి.
Also Read: ఈ రాశివారిని 2025 వరకూ శని ఆడుకుంటుంది కానీ ఆర్థికంగా బలపరుస్తుంది
మకర రాశి (Capricorn Horoscope Today)
వైవాహిక , ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలను విస్మరించకండి. మీ భాగస్వామితో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. రోజంతా చాలా బిజీగా ఉంటారు. ఆరోగ్యం, ఆర్థిక విషయాలలో ఈ రోజు బాగుంటుంది. ఈరోజు వృత్తి జీవితంలో చాలా ఇబ్బందులు ఉండవు. మీరు మీ పని నాణ్యతపై దృష్టి పెట్టగలరు. కొన్ని పనులకు సృజనాత్మకత మరియు కొత్త ఆలోచనలు అవసరం. ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అయితే ఖర్చులపై నియంత్రణ ఉంచండి
కుంభ రాశి (Aquarius Horoscope Today)
ఈ రాశివారు గత జ్ఞాపకాల్లో మునిగితేలుతారు. వాటి విచారంలో పడి ప్రస్తుతం చేయాల్సిన పనని విస్మరించే అవకాశం ఉంది. వాటినుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని గుర్తించండి. మీ భావాలను తెలియజేసేందుకు సంకోచించవద్దు. పనిలో విజయం కోసం కొత్త ఆలోచనలు సూచనలు చేయండి. ఒత్తిడితో కూడిన పనులను కష్టపడి, అంకితభావంతో పూర్తి చేయండి. ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇదే మంచి సమయం.
Also Read: ఈ రాశివారికి 2024లో అనారోగ్యం, మానసిక ఒత్తిడి తప్పదు - ఆ 3 నెలలు కొంత ఉపశమనం!
మీన రాశి (Pisces Horoscope Today)
కొన్ని సంబంధాలు మీరు ఊహించినంత అందంగా ఉండవు. ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. అనుకోని అతిథులు వస్తారు. ఆస్తి, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం ఇది. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి నిధులను పొందవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి