![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Horoscope 15th March 2024: ఈ రాశివారి జీవితంలో ఈ రోజు ఊహించని మార్పులొస్తాయి - మార్చి 15 రాశిఫలాలు
Horoscope Tomorrow's Prediction 15 March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
![Horoscope 15th March 2024: ఈ రాశివారి జీవితంలో ఈ రోజు ఊహించని మార్పులొస్తాయి - మార్చి 15 రాశిఫలాలు Horoscope Today Astrological prediction for March 15, 2024 know in telugu Horoscope 15th March 2024: ఈ రాశివారి జీవితంలో ఈ రోజు ఊహించని మార్పులొస్తాయి - మార్చి 15 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/14/f22f6e2e91e3d214c88f9ed7607e09ca1710421584204217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope 15th March 2024 Prediction
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. పనిలో ఎదురయ్యే సవాళ్లను ప్రశాంతమైన మనస్సుతో ఎదుర్కోండి. మీ పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబానికి సమయం కేటాయించడం వల్ల ఆనందంగా ఉంటారు.
ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం మేష రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ రోజు ప్రారంభించే పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి..ఖర్చు తగ్గించుకోవాలి. మీ కుటుంబ సంబంధాలు బలపడతాయి. ప్రియమైనవారికి సమయం కేటాయిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గత తప్పిదాల నుంచి పాఠం నేర్చుకుంటూ ముందుకు సాగండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు అంత మంచి రోజు కాదు. ఎంతో కష్టపడితే కానీ మంచి ఫలితం సాధించలేరు. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి సారించాలి. అధిక ఒత్తిడి తీసుకోవద్దు. మీ బంధాలను పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా మంచి రోజు. ఆరోగ్యం బావుంటుంది. ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఈ రోజు నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ఉద్యోగంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో చాలా ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ పనులపై దృష్టి పెట్టండి. ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు కానీ కొంతకాలం ఆగడం మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.
సింహ రాశి
ఈ రోజు సింహరాశి వారికి ఆహ్లాదకరమైన రోజు. ఉద్యోగులు మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. కెరీర్లో పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం..కానీ కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. జీవితంలో చాలా మార్పులొస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తవహించండి.
Also Read: ఉగాది వరకూ ఈ రాశులవారికి ఆదాయం - ఆ 5 రాశులవారికి అసహనం
కన్యా రాశి
ఈ రోజు కన్యారాశి వారికి శుభప్రదమైన రోజు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వ్యాపారంలో మంచి లాబాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆఫీసు పనులు పూర్తి చేయడానికి కొత్త వ్యూహాన్ని రూపొందించండి. కుటుంబ సభ్యుల మద్దతుతో, పనిలో అడ్డంకులు తొలగిపోతాయి . భాగస్వామ్య వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
తులా రాశి
ఈ రోజు తుల రాశి వారికి వృత్తి, వ్యాపార పరంగా విజయవంతమైన రోజు. ఉద్యోగులు పనితీరులో ప్రశంసలు అందుకుంటారు. మీ పురోగతి మెరుగుపడుతుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. చేపట్టిన పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు గందరగోళానికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభదినం. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారంలో మంచి విజయాలు ఉంటాయి. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. జీవితంలో ఊహించని మార్పులను అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఇబ్బందులకు భయపడవద్దు. డబ్బుకు సంబంధించి కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. కార్యాలయంలో సవాలుగా ఉన్న పనులను పూర్తి చేయడానికి కొత్త వ్యూహాన్ని రూపొందించండి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీరు మీ పనిలో కష్టపడి పని చేయాలి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడాలి. మీ వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ మీరు నిరుత్సాహపడకూడదు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఈరోజు మకర రాశి వారు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. మీ భావాలను భాగస్వామితో పంచుకోవడానికి సంకోచించకండి.
కుంభ రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ ఆలోచన మరియు భావజాలం ఈ రోజు బాగానే ఉంటుంది. మీ వ్యూహాత్మక వైఖరి మీకు మంచి సక్సెస్ అందిస్తుంది. ఈ రోజు వ్యాపార సంబంధిత నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. గత తప్పుల నుంచి పాఠం నేర్చుకుని ముందుకు సాగండి. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ పనితీరు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాలి.
మీన రాశి
ఈ రోజు మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి..ఆదాయాన్ని పెంచుకునే మార్గాలకోసం వెతకండి..
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)