Horoscope Today: ఈ రోజు ఈ రాశులవారి ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి...వారు శుభవార్త వినే అవకాశం ఉంది...ఏ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 అక్టోబరు 2 శనివారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కెరీర్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు. కార్యాలయంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలరు. వ్యాపారం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజకంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 
వృషభం
ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికలు వేస్తారు. కుటుంబానికి సమయం కేటాయించండి. పిల్లల వైపు నుంచి  కొత్త సమాచారం అందుకోవచ్చు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు.  పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. వృద్ధులకు ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉంటాయి.
మిథునం
ఈరోజు మీరు శుభవార్త వింటారు . ఏదైనా కొనాలని ఆలోచిస్తే అందుకు ఇదే మంచిరోజు. అధిక ఒత్తిడి తీసుకోవద్దు. సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న ప్రాజెక్టులకు ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఇది.  వ్యక్తిగత జీవిత విషయాలను స్నేహితులతో పంచుకోవద్దు. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థికంగా మీకు కలిసొచ్చే రోజిది. 
కర్కాటకం
వివాదాలకు అవకాశం ఉంది. అనవసర వాదనలు పెంచుకోవద్దు. అత్తింటివైపు నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.  కొత్త ఆర్థిక ప్రణాళికల గురించి ప్లాన్ చేస్తారు.  కొత్తగా పరిచయమైన వారినుంచి జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.  ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. మీకు పెద్దల ఆశీశ్సులు అందుతాయి. భూమి లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఓ ప్రణాళికను రూపొందిస్తారు
సింహం
ఈ రోజు పర్యటనను వాయిదా వేయండి. ఈ రోజు ఇంట్లో వండిన ఆహారాన్ని ఆస్వాదించండి. ఆరోగ్యం బావుంటుంది. రాబోయే  అడ్డంకులను అధిగమించే శక్తి కలిగిఉంటారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 
కన్య
జీతం పెరుగుదల కోసం మీ ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు మంచిరోజిది. విద్యార్థులకు, ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అనుకూల సమయం. పెండింగ్ కేసులు పరిష్కారమవుతాయి. రోజు ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు అవుతుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. 
తుల
మీ సానుకూల ఆలోచన మీకు కొత్త దిశానిర్దేశం చేస్తాయి. చాలా పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. పని ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యులతో పరస్పర సమన్వయం మెరుగుపడుతుంది. ఈ రోజు మహిళలకు మంచి రోజు అవుతుంది. మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచాల్సిన సమయం వచ్చింది. విద్యార్థులకు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.  కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం సరిగా ఉండదు. 
వృశ్చికం
ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలో మీరు స్నేహితుల మద్దతు పొందుతారు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ  రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌ల్లో పని ప్రారంభించేందుకు శుభసమయం కొత్త వ్యక్తులను కలవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. 
ధనుస్సు
వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. భార్యతో వివాదాలు ఉండొచ్చు. మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం.  మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త సవాళ్లు సిద్ధంగా ఉంటాయి. మీ దినచర్యలో మార్పు ఉంటుంది.  మీ కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాతే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోండి. పెండింగ్ కేసుల్లో కొంత మెరుగుదల ఉండే అవకాశం ఉంది.
మకరం
ఈరోజు మీకు మంచిరోజు. వ్యాపారస్తులకు కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.  సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త సమాచారాన్ని పొందుతారు.  ఈ రోజు ఎవరికీ సలహా ఇవ్వొద్దు. కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొత్త పనిని ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది కాదు.  కుటుంబ పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వారపు జాతకం
కుంభం
కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించేందుకు శుభసమయం. ఆస్తి కొనుగోలు దిశగా అడుగేయవచ్చు.  కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముఖ్యమైన పనులు పూర్తికావడంతో మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  ఉద్యోగం చేసేవారికి సాధారణంగా ఉంటుంది. 
మీనం
కొత్తగా పెట్టుబడి పెట్టొచ్చు. కుటుంబంలో వివాదాలు తలెత్తే సూచనలున్నాయి.  మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు.  కొత్త పనులు  ప్రారంభించేందుకు కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి సమయం. అనవసరమైన విషయాలతో  సమయం వృధా చేయకండి.  పిల్లల మనస్సు చదువుపై నిమగ్నమై ఉంటుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు పనిలో జాప్యం జరుగుతుంది. టెన్షన్ పోతుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. 

Also Read: కరోనాపై పోరాటంలో మరో ముందడుగు.. కొవిడ్19 యాంటీవైరల్ మెడిసిన్ రెడీ.. అద్భుతమైన ఫలితాలు

Also Read: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...

Also Read: ఇల్లు శుభ్రం చేశాక చీపురుని ఇలా పెడితే దరిద్రమట..మీకు తెలుసా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Oct 2021 06:24 AM (IST) Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2 October 2021

సంబంధిత కథనాలు

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు

Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం

Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం